Dacoit:'డకాయిట్' షూటింగ్‌లో శృతి హాసన్

  • IndiaGlitz, [Thursday,June 13 2024]

అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్‌లో టీమ్‌తో జాయిన్ అయింది. ఈ ఇంపార్ట్టెంట్, మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో మేకర్స్ లీడ్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శృతి హాసన్, శేష్‌తో సెల్ఫీని షేర్ చేశారు.

డకాయిట్ ఇద్దరు మాజీ ప్రేమికుల కథ, వారు తమ లైఫ్స్ ని మార్చడానికి వరుస దోపిడీలకు ఏకం కావాలి. అడివి శేష్ 'క్షణం', 'గూఢచారి'తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

అడివి శేష్, షానీల్ డియో ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రం 2022లో ప్రశంసలు పొందిన 'మేజర్' తర్వాత శేష్ యొక్క సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు: అడివి శేష్, శృతి హాసన్

More News

Bharateeyudu2:‘భారతీయుడు 2’ నుంచి ‘తాతా వస్తాడే’ అంటూ ఊపు తెప్పించే పాట విడుదల

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో

The Birthday Boy:'ది బ‌ర్త్‌డే బాయ్' టైటిల్ గ్లింప్స్ విడుద‌ల

ఇప్పుడు రొటిన్ క‌థ‌ల‌కు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్య‌మైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు.

8 Vasanthalu:అనంతిక సనీల్‌కుమార్‌ '8 వసంతాలు'

మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే

Matka:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  జూన్ 19 నుంచి 'మట్కా' షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో

Prandeep Thakore:‘రక్షణ’ చిత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రియలిస్టిక్ అప్రోచ్‌తో తీశాను..  దర్శక నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్

హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మించిన చిత్రం ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కాబోతోంది.