పెళ్ళి గురించి ఎందుకమ్మా? బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి హాసన్ లాక్డౌన్
- IndiaGlitz, [Wednesday,April 21 2021]
పెళ్ళి గురించి అడిగితే శ్రుతి హాసన్ కస్సుబస్సులాడుతుంది. 'ఎందుకు? పెళ్ళి గురించి ఇప్పుడు ఎందుకమ్మా?' అంటుంది. ఓ అడుగు ముందుకు వేసి పెళ్ళి ప్రశ్న వేసినోళ్లను 'మీ పెళ్ళి ఎప్పుడు? ముందు అది చెప్పండి?' అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచన లేదన్నట్టు వ్యవహరిస్తోంది.
'సలార్' హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ముంబయ్ వెళ్ళింది శ్రుతి. బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో ఫ్లాట్‌లో ఉంటుంది. ముంబయ్‌లో లాక్డౌన్ కనుక ఎటు వెళ్ళకుండా బుద్దిగా ఇంట్లో ఉంటున్నార్ట. బాయ్‌ఫ్రెండ్‌తో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఓ వయసు వచ్చిన హీరోయిన్లకు ప్రేక్షలకుల నుంచి పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు తప్పడం లేదు. సోషల్ మీడియా లైవ్‌లోకి రావడమే ఆలస్యం 'పెళ్ళెప్పడమ్మా' అని అడుగుతున్నారు. శ్రుతి హాసన్‌కి సైతం ఈ సమస్య తప్పలేదు. గతంలో లండన్ యాక్టర్ మైఖేల్ తో కొన్నాళ్ళు డేటింగ్ లో ఉన్నారు శ్రుతి. తర్వాత బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు శాంతనుతో డేటింగ్ లో ఉన్నారు.