పెళ్ళి గురించి ఎందుకమ్మా? బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి హాసన్ లాక్డౌన్
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్ళి గురించి అడిగితే శ్రుతి హాసన్ కస్సుబస్సులాడుతుంది. `ఎందుకు? పెళ్ళి గురించి ఇప్పుడు ఎందుకమ్మా?` అంటుంది. ఓ అడుగు ముందుకు వేసి పెళ్ళి ప్రశ్న వేసినోళ్లను `మీ పెళ్ళి ఎప్పుడు? ముందు అది చెప్పండి?` అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచన లేదన్నట్టు వ్యవహరిస్తోంది.
`సలార్` హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ముంబయ్ వెళ్ళింది శ్రుతి. బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో ఫ్లాట్‌లో ఉంటుంది. ముంబయ్‌లో లాక్డౌన్ కనుక ఎటు వెళ్ళకుండా బుద్దిగా ఇంట్లో ఉంటున్నార్ట. బాయ్‌ఫ్రెండ్‌తో ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఓ వయసు వచ్చిన హీరోయిన్లకు ప్రేక్షలకుల నుంచి పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు తప్పడం లేదు. సోషల్ మీడియా లైవ్‌లోకి రావడమే ఆలస్యం `పెళ్ళెప్పడమ్మా` అని అడుగుతున్నారు. శ్రుతి హాసన్‌కి సైతం ఈ సమస్య తప్పలేదు. గతంలో లండన్ యాక్టర్ మైఖేల్ తో కొన్నాళ్ళు డేటింగ్ లో ఉన్నారు శ్రుతి. తర్వాత బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు శాంతనుతో డేటింగ్ లో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout