ఆ ఇద్దరు లెజెండ్స్ తో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను - శ్రేయా శర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
జై చిరంజీవ, దూకుడు, రోబో, గాయకుడు...తదితర చిత్రాల్లో బాలనటిగా నటించడంతో పాటు రస్నా, సెల్లో పెన్, ఈనో...తదితర యాడ్స్ లోను, కన్ హియా, జూట్ బోలే కవ్వాకటే తదితర సీరియల్స్ లోను నటించి మెప్పించి నేడు నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న నటి శ్రేయా శర్మ. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని జి.నాగకోటేశ్వరరావు తెరకెక్కించారు. ఫ్రెష్ ఫ్యూర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈనెల16న నిర్మలా కాన్వెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా శ్రేయా శర్మతో చిట్ చాట్ మీకోసం...
మీ ఫ్యామిలీ గురించి..?
నాన్న వికాష్ శర్మ ఇంజనీర్. అమ్మ రీతు శర్మ. నేను లా సెకండియర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం. లా పూర్తయిన తర్వాత కంప్లీట్ గా ఏక్టరస్ గా సినిమాలు చేస్తాను.
చిరంజీవితో జై చిరంజీవ, నాగార్జునతో నిర్మలా కాన్వెంట్ చిత్రాల్లో నటించారు కదా..! ఎలా ఫీలవుతున్నారు..?
నిజంగా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. చిరంజీవి గారితో కలిసి నటించేటప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నాకు అప్పుడు అంతగా తెలియలేదు కానీ....తర్వాత తెలిసింది లెజెండ్ తో వర్క్ చేసాను అని. అలాగే మరో లెజెండ్ నాగార్జున గారితో నిర్మలా కాన్వెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే...నాకు, నాగార్జున గారికి మధ్య సీన్స్ లేవు. భవిష్యత్ లో నాగార్జున గారితో కలిసి నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.
బాలనటిగా చాలా సినిమాల్లో నటించారు కదా...రోషన్ కి హీరోగా ఇదే ఫస్ట్ ఫిల్మ్. మరి..రోషన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
రోషన్ హీరోగా ఫస్ట్ ఇదే అయినప్పటికీ...రుద్రమదేవి సినిమాలో నటించి ఉండడం వలన అనుకుంట కెమెరా ముందు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా బాగా నటించాడు. చాలా హార్డ్ వర్కర్.
నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
మా ప్రేమను వ్యతిరేకించే పాత్ర. చాలా ఇంపార్టెంట్ రోల్ చేసారు. సెకండాఫ్ అంతా ఉంటారు. నాగార్జున గార్ని చూసి చాలా నేర్చుకున్నాం. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ ఒక ట్రీట్ లా ఉంటుంది.
ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అనుకుంటున్నారు..?
ప్రియాంక చోప్రా, కంగనా, అసిన్ చేసినటువంటి పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు చేయాలి అనుకుంటున్నాను.
మీ హాబీస్..?
డ్యాన్స్ , స్విమ్మింగ్
మీ ఫేవరేట్ హీరో ఎవరు..?
ఫారుఖ్ ఖాన్. తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.
మీ లక్ష్యం ఏమిటి..?
టాప్ ఏక్టరెస్ అవ్వాలి అదే నా లక్ష్యం.
డ్రీమ్ రోల్ ఏమిటి..?
డ్రీమ్ రోల్స్ చాలా ఉన్నాయి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments