ఎదురుచూస్తున్న శ్రియా..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టి హీరోయిన్‌గా పన్నెండేళ్లు దాటిన హీరోయిన్స్‌లో శ్రియా ఒకటి. స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. తన గ్లామర్‌తో ఈ తరం కుర్ర హీరోయిన్స్‌గా ధీటుగా పోటీనిస్తుంది. మూడు పదులు వయసు దాటినా అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అవకాశాలను ఒడిసి పట్టుకుంటూ ఉంది.
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో బాలయ్యతో జత కట్టిన శ్రియా, బాలయ్య ఇప్పుడు చస్తోన్న 101వ చిత్రం `పైసా వసూల్`లో కూడా నటిస్తుంది. మరోవైపు తమిళంలో నరకాసురుడు చిత్రంలో నటిస్తుంది. తెలుగులో నారా రోహిత్, సుధీర్‌బాబు నటిస్తున్న వీరభోగ వసంతరాయులు చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంది. పైసా వసూల్‌లో జర్నలిస్ట్‌గా నటిస్తుంది. ఈ పాత్రల్లో నటించడం ఇదే ప్రథమం కాబట్టి ఆయా పాత్రల్లో తెరపై ఎలా కనపడబోతానోనని శ్రియా ఆసక్తికరంగా ఎదురుచూస్తుందట మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments