ఎదురుచూస్తున్న శ్రియా..

  • IndiaGlitz, [Monday,August 07 2017]

తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టి హీరోయిన్‌గా పన్నెండేళ్లు దాటిన హీరోయిన్స్‌లో శ్రియా ఒక‌టి. స్టార్ హీరోలంద‌రితోనూ ఆడిపాడింది. త‌న గ్లామ‌ర్‌తో ఈ త‌రం కుర్ర హీరోయిన్స్‌గా ధీటుగా పోటీనిస్తుంది. మూడు ప‌దులు వ‌య‌సు దాటినా అందం ఏమాత్రం చెక్కు చెద‌ర‌లేదు. అవ‌కాశాల‌ను ఒడిసి ప‌ట్టుకుంటూ ఉంది.

గౌత‌మిపుత్ర శాత‌కర్ణి చిత్రంలో బాలయ్య‌తో జ‌త క‌ట్టిన శ్రియా, బాల‌య్య ఇప్పుడు చ‌స్తోన్న 101వ చిత్రం 'పైసా వ‌సూల్‌'లో కూడా న‌టిస్తుంది. మ‌రోవైపు త‌మిళంలో న‌ర‌కాసురుడు చిత్రంలో న‌టిస్తుంది. తెలుగులో నారా రోహిత్‌, సుధీర్‌బాబు న‌టిస్తున్న వీర‌భోగ వసంత‌రాయులు చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుంది. పైసా వ‌సూల్‌లో జ‌ర్న‌లిస్ట్‌గా న‌టిస్తుంది. ఈ పాత్ర‌ల్లో న‌టించ‌డం ఇదే ప్ర‌థ‌మం కాబ‌ట్టి ఆయా పాత్ర‌ల్లో తెర‌పై ఎలా క‌న‌ప‌డ‌బోతానోన‌ని శ్రియా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తుంద‌ట మ‌రి.