గాల్లో తేలుతున్న శ్రియ
Send us your feedback to audioarticles@vaarta.com
గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే.. అని హుషారుగా పాట పాడుకుంటోంది శ్రియ. `ఇష్టం`తో తెలుగు సినిమా కెరీర్‌ను మొదలుపెట్టిన శ్రియకు `మనం` చిత్రానికి ముందు కెరీర్ ఆశాజనకంగా లేదు. శ్రియ పని ఇక అయిపోయినట్టే అని కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకు `మనం` సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.
దాంతో తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది. దానికి తోడు `గౌతమీ పుత్ర శాతకర్ణి`, ఈ మధ్య `పైసా వసూల్` వంటి సినిమాలు కూడా శ్రియకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాంతో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె తమిళంలో `నరకాసురన్` సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులో `వీరభోగ వసంతరాయలు`లో ఎయిర్ హోస్టెస్‌గా నటిస్తోంది. `నరకాసురన్`లో ఆమె పోలీస్ పాత్ర చేస్తోంది. ` పెళ్లికి, కెరీర్‌కి సంబంధం లేదు. నాకు జీవితాంతం నటించాలని ఉంది. ప్రస్తుతం వస్తున్న అవకాశాలను చూస్తే చాలా ఆనందంగా ఉంది`` అని ఆ మధ్య చెప్పింది శ్రియ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments