మరోసారి గృహిణి పాత్రలో శ్రియ?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో.. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న ఓ గృహిణి పాత్రకు ఆర్టిస్ట్ కావాలంటే అందరి దర్శకుల చూపు శ్రియ పైనే. ఆ పాత్రల్లో ఆమె అంతలా ఒదిగిపోతుందన్నది వారి నమ్మకం. గతంలో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి', ఇటీవల విడుదలైన 'గాయత్రి' సినిమాలతో అది నిరూపితమైంది కూడా.
అటు బాలకృష్ణ లాంటి అగ్ర నటులైనా, ఇటు మంచు విష్ణు లాంటి యువ కథానాయకులైనా.. శ్రియ నటనలో ఎటువంటి తేడా ఉండదు. అదే శ్రియ ప్రత్యేకత. ఇప్పుడు ఆమెకున్న ఈ ప్రత్యేకమైన నటనే.. విక్టరీ వెంకటేష్ తదుపరి చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చేలా చేసిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వెంకటేష్, తేజ కలయికలో రానున్న 'ఆటానాదే వేటానాదే' (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో వెంకటేష్ సరసన గృహిణి పాత్ర కోసం శ్రియ పేరును పరిశీస్తున్నారని సమాచారం. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో ఎంతో కీలకంగా ఉంటాయని తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలో వెంకటేష్, శ్రియ కాంబినేషన్ లో 'సుభాష్ చంద్రబోస్', 'గోపాల గోపాల' చిత్రాలు వచ్చిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com