మ‌రోసారి గృహిణి పాత్ర‌లో శ్రియ‌?

  • IndiaGlitz, [Monday,February 26 2018]

టాలీవుడ్‌లో.. ప్ర‌స్తుతం న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న ఓ గృహిణి పాత్ర‌కు ఆర్టిస్ట్ కావాలంటే అంద‌రి ద‌ర్శ‌కుల చూపు శ్రియ పైనే. ఆ పాత్ర‌ల్లో ఆమె అంత‌లా ఒదిగిపోతుంద‌న్న‌ది వారి న‌మ్మ‌కం. గ‌తంలో వ‌చ్చిన 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి', ఇటీవ‌ల విడుద‌లైన 'గాయ‌త్రి' సినిమాల‌తో అది నిరూపితమైంది కూడా.

అటు బాల‌కృష్ణ లాంటి అగ్ర న‌టులైనా, ఇటు మంచు విష్ణు లాంటి యువ క‌థానాయ‌కులైనా.. శ్రియ‌ న‌ట‌న‌లో ఎటువంటి తేడా ఉండ‌దు. అదే శ్రియ ప్ర‌త్యేక‌త‌. ఇప్పుడు ఆమెకున్న ఈ ప్ర‌త్యేక‌మైన న‌ట‌నే.. విక్ట‌రీ వెంక‌టేష్ త‌దుప‌రి చిత్రంలో న‌టించేందుకు అవ‌కాశం వ‌చ్చేలా చేసింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వెంక‌టేష్, తేజ క‌ల‌యిక‌లో రానున్న 'ఆటానాదే వేటానాదే' (ప్ర‌చారంలో ఉన్న టైటిల్) చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న గృహిణి పాత్ర కోసం శ్రియ పేరును ప‌రిశీస్తున్నారని స‌మాచారం. వీరి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాలో ఎంతో కీల‌కంగా ఉంటాయ‌ని తెలిసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గ‌తంలో వెంక‌టేష్, శ్రియ కాంబినేష‌న్ లో 'సుభాష్ చంద్రబోస్', 'గోపాల గోపాల' చిత్రాలు వ‌చ్చిన విష‌యం విదిత‌మే.

More News

ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న స‌మంత‌

తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' కోసం జెస్సీగా క‌నిపించి.. కుర్రకారు మనసుల‌ని తన అందం, అభిన‌యంతో దోచుకున్నారు చెన్నై బ్యూటీ సమంత.

'కణం' మొదటి సింగిల్‌ 'సంజాలి'

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. ఈ చిత్రం మొదటి సింగిల్‌ 'సంజాలి..'ను ఆదివారం విడుదల చేశారు.

'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టినరోజు వేడుకలు

'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉదయం 'మా' కార్యాలయంలో నిడారంబరంగా జరిగాయి.

ఒక గొప్ప స్టార్ ను కోల్పోయాము : డా. కే.ఎల్. నారాయణ

శ్రీదేవి లాంటి గొప్ప స్టార్ తో 'క్షణక్షణం'చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానూ,గర్వాంగానూ ఉండేదని,అయితే ఆమె హఠాత్తుగా మృతి చెందడం భారతీయ సినిమా రంగానికే తీరని లోటని నిర్మాత డా.కే.ఎల్.నారాయణ చెప్పారు.

ఘ‌నంగా 'దండుపాళ్యం -3' ఆడియో ఫంక్ష‌న్‌

దండుపాళ్యం గ్యాంగ్ కి క‌న్న‌డ‌లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రాజు రియ‌లిస్టిక్ గా తెర‌కెక్కించారు. అలా చేసిన‌  దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించాయి.