లెక్క తేల్చేస్తున్న శ్రియా శ‌ర‌న్‌

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

శ్రియా శ‌ర‌న్ లెక్క స‌రిచేస్తుందా? అంటే అవుననే సమాధానం విన‌ప‌డుతుంది. ఇంత‌కు శ్రియ ఏ విష‌యంలో లెక్క స‌రిచేస్తుందనే వివరాల్లోకెళ్తే.. గ‌తంలో వెంక‌టేశ్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్రారంభ‌మైంది. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమాలో వెంకీ జ‌త‌గా శ్రియాశ‌ర‌న్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు.

అయితే ఆ సినిమా ఆగిపోవ‌డం, అదే స‌మ‌యంలో శ్రియా శ‌రన్ పెళ్లి చేసుకోవ‌డం వంటి కార‌ణాలతో వెంకీ, శ్రియ జోడి మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం రాలేదు. అయితే ఆ సినిమా మేకింగ్ స‌మ‌యంలో శ్రియ‌కు నిర్మాత సురేష్‌బాబు అడ్వాన్స్ ఇచ్చాడు. దాన్ని తిరిగి తీసుకోలేదు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ స్థానంలో శ్రియ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైంద‌ని టాక్‌. ఎలాగంటే.. వెంక‌టేశ్ హీరోగా త‌మిళ చిత్రం 'అసుర‌న్‌'ను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. ఇందులో వెంక‌టేశ్ హీరోగా న‌టించ‌బోతున్నారు. కాగా హీరోయిన్ మంజు వారియ‌ర్ స్థానంలో శ్రియాశ‌ర‌న్‌ను తీసుకోబోతున్నార‌ట‌.

ధ‌నుష్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'అసుర‌న్‌'ను త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగు రీమేక్‌ను క‌లైపులిథాను, డి.సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాక సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అలాగే ప్ర‌స్తుతం వెంక‌టేశ్, చైత‌న్య‌తో క‌లిసి 'వెంకీమామ‌' సినిమాలో న‌టించాడు. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

More News

హ్యాపీ బర్త్ డే అనుష్క శెట్టి..

అది 2005.. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఆర్తి అగ‌ర్వాల్, త్రిష‌, శ్రీయ లాంటి హీరోయిన్లు చ‌క్రం తిప్పుతున్నారు.

గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి

టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతిరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు.

‘పవన్.. నువ్ ఏ రోజైనా చిరంజీవి పేరు చెప్పావా?’

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సునీల్ చేతుల మీదుగా 'అప్పుడు- ఇప్పుడు' సినిమా సాంగ్ విడుదల

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.

జనసేనకు 70 సీట్లు వచ్చేవి కానీ... పవన్

‘జనసేన సమావేశాలకు వచ్చిన యువతలో 70 శాతం మంది పార్టీకి ఓట్లు వేసినా 70 సీట్లు వచ్చేవి.