చిరుతో శ్రియా...

  • IndiaGlitz, [Friday,September 23 2016]

మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్‌లోన‌టించిన శ్రియ ఇప్పుడు మ‌రోసారి చిరంజీవితో న‌టించ‌నుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా ఖైదీ నంబ‌ర్ 150 సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.

అందులో ఒక‌టి యంగ్ పాత్ర కాగా, మ‌రొక‌టి కాస్తా వ‌య‌సైన పాత్ర‌. యంగ్ చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంటే, వ‌య‌సైన చిరు ఉన్న ఎపిసోడ్‌లో శ్రియ న‌టించ‌నుంద‌ని టాక్‌. ఈ పాత్ర లెంగ్త్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.