శ్రియ ఉంటే హిట్టే..

  • IndiaGlitz, [Monday,March 28 2016]

క‌థానాయిక‌గా 15 ఏళ్ల ప్ర‌యాణం ఆమెది. అయినా ఇప్ప‌టికీ అదే ఫిట్ నెస్‌. అదే గ్లామ‌ర్‌. ద‌టీజ్ శ్రియ‌. కెరీర్ ప్రారంభంలోనే అగ్ర హీరోలంద‌రితో ఆడిపాడినా.. ఆమె ఇన్నాళ్ల‌పాటు కొన‌సాగ‌డ‌మే ఓ విశేష‌మైతే.. పాత్ర నిడివితో సంబంధం లేకుండా త‌న ప్ర‌జెన్స్ ఉంటే హిట్టే అన్న‌ట్లుగా గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌లో దూసుకుపోతోంది శ్రియ‌.

2014లో 'మ‌నం' కోసం రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించిన శ్రియ ఆ సినిమాతో మెమ‌ర‌బుల్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఇక 2015లోనూ వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'గోపాల గోపాల' తోనూ మ‌రో విజ‌యం త‌న కైవ‌సం చేసుకుంది. 2016 విష‌యానికి వ‌స్తే.. అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెరిసిన 'ఊపిరి'తో మ‌రో సారి విజ‌యాన్ని అందుకుంది ఈ ఢిల్లీ సుంద‌రి. మొత్తానికి 'మ‌నం' త‌రువాత శ్రియ ఉంటే హిట్టే అనే సెంటిమెంట్ టాలీవుడ్‌లో పెరిగిపోయింది. మ‌రి శ్రియ మిడాస్ ట‌చ్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆమె చెంత‌కు చేరే త‌దుప‌రి భారీ బ‌డ్జెట్ మూవీ ఏద‌వుతుందో చూడాలి.