శ్రియ ఆ సినిమా చేయడం లేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ‘ఆటా నాదే వేటా నాదే’ (ప్రచారంలో ఉన్న పేరు) సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నారా రోహిత్ మరో కథానాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈషా రెబ్బా.. నారా రోహిత్‌తో కలిసి తెరను పంచుకోనుందని సమాచారమ్. నేటి విద్యావ్యవస్థను ప్రశ్నించే నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో.. వెంకీ ఫిజిక్స్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానాయికగా నటించాల్సిన శ్రియ ఈ మూవీ నుంచి తప్పుకుందని తెలిసింది. కాస్త వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం వెంకీకి జోడీగా శ్రియని ఎంపిక చేసింది చిత్ర బృందం. అయితే.. ఆమె గత నెలలో వివాహం చేసుకున్న నేపథ్యంలో.. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయం తీసుకోవడంతో.. ఇప్పుడు మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో పడిందట చిత్ర బృందం. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments