Shriya Saran : 40 ఏళ్ల వయసు, పెళ్లయి కూతురు కూడా.. అయినా ఏముందిరా బాబు

  • IndiaGlitz, [Wednesday,November 30 2022]

శ్రీయా శరణ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అందం , అభినయంతో ప్రేక్షకుల మదిలో సుస్ధిర స్థానం సంపాదించారు శ్రీయ. దక్షిణాదిలోని అందరు అగ్ర నటుల సరసన నటించారు శ్రీయ. 2004లో ఇష్టం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఏళ్ల పాటు టాప్ స్టార్‌గా కొనసాగింది. కెరీర్ మసకబారుతున్న సమయంలో ఆండ్రూ కోశ్చీవ్‌ని పెళ్లాడి అభిమానులకు, సినీ ప్రముఖులకు షాకిచ్చింది. తర్వాత ఓ పాపకు తల్లయి, ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్ చేస్తోంది.

బికినీలో కూతురితో కలిసి హాట్ ఫోటో షూట్:

అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసింది. ఎవరు ఛాన్స్ ఇచ్చినా సినిమా చేస్తానని ఆమె తెలిపింది. అంతేకాకుండా హాట్ హాట్ ఫోటో షోటోలతో ఇంకా తనలో వేడి తగ్గలేదని నిరూపిస్తోంది. ఇటీవల బికినీలో తన కుమార్తెతో కలిసి శ్రీయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరికి వయసు పెరిగే కొద్ది అందం పెరిగిపోతుంటే.. మరికొందరికి మాత్రం వయసు తగ్గిపోతుంది. ఈ రెండో కోవకి చెందిన వారే శ్రీయ. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేస్తున్నారు.

పాలరాతి శిల్పంలా హోయలు:

తాజాగా శ్రీయ మరోసారి తన అందాల ప్రదర్శన చేసింది. వైట్ డిజైనర్ శారీలో శ్రీయా కొంటెచూపులు చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తోంది. అంతేనా వయ్యారంగా బాడీని మెలికలు తిప్పుతూ, పాలరాతి శిల్పంలా హోయలు పోతోంది. అది చూసిన నెటిజన్లు పెళ్లయి , పాప వున్నా శ్రీయా నాజూకుతనం, ఛార్మింగ్ చేసి నోరెళ్లబెడుతున్నారు.