తప్పు తెలుసుకున్నానంటున్నశ్రియ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..సంతోషం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని..టాలీవుడ్ టాప్ హీరోస్ సరసన నటించిన అందాల భామ శ్రియ. అవకాశాలు లేక తెరమరుగయిన శ్రియ ఈమధ్య మనం సినిమాలో నాగ్ సరసన నటించి మళ్లీ తెర పైకి వచ్చింది. ఆతర్వాత వెంకీ తో గోపాల గోపాల సినిమాలో నటించింది.
ఇదిలా ఉంటే..శ్రియ.. తను షాప్ ఓపినింగ్స్ కి వెళుతుంటే ఆ సమాచారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసేదాన్ని. అది చూసి నన్ను చూడడానికి నేను ఎక్కడికి వెళితే అక్కడికి చాలా మంది అభిమానులు వచ్చేవారు. నన్ను చూడడానికి అంత మంది అభిమానులు వచ్చారంటే సంతోషంగానే ఉంటుంది. అయితే అలాంటి సమయంలో కొంత మంది కుర్రాళ్లు నన్ను తడిమేస్తుంటారు...గిచ్చేస్తుంటారు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అలా బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఏ పబ్లిక్ ఈవెంట్ కి వెళుతున్నానో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఎంత తప్పో తెలుసుకున్నాను. అందుచేత ఇక నుంచి ఏ పబ్లిక్ ఈవెంట్ కి వెళుతున్నాననే సమాచారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటోంది ఈ అమ్మడు అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments