అర్జున్ రెడ్డిలో శ్రియ
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేసిన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం కేవలం టాలీవుడ్‌నే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌ను కూడా కదిలించింది. అందుకే ఈ సినిమాని ఇప్పుడు తమిళంతో పాటు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు.
తమిళంలో ఈ చిత్రాన్ని 'వర్మ' పేరుతో దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. ధృవ్‌కు జోడిగా శ్రియా శర్మను ఎంపిక చేసినట్టు సమాచారం.
తెలుగులో 'జై చిరంజీవ', 'దూకుడు', 'రచ్చ' లాంటి చిత్రాల్లో బాల నటిగా నటించిన శ్రియా.. 'గాయకుడు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 'నిర్మల కాన్వెంట్' సినిమాలో కూడా నాయికగా నటించింది.
ఇప్పుడు తమిళంలో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. త్వరలోనే శ్రియ ఎంట్రీ పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. తెలుగు నటి ఈశ్వరీ రావు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com