శ్రియపై సిల్లీ కామెంట్స్.. ఆమె భర్త ఏమన్నాడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో హీరోయిన్గా ఓ ఊపు ఊపిన శ్రియ ఇప్పుడు తన లవర్ అండ్రూ కొచ్చిన్ను పెళ్లి చేసుకుని సెటిలైంది. వీరిద్దరూ స్పెయినల్లో క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శ్రియా ఈ క్వారంటైన్ సమయంలో ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటూ వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా మరోసారి ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రియా శరన్ అభిమానులను పలకరించారు. వారి ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ శ్రియా ఎదభాగం గురించి సిల్లీ కామెంట్ చేశాడు. అయితే దీనిపై శ్రియా సీరియస్‌గా స్పందించలేదు. దాన్ని తన భర్తకు అండ్రూకొచ్చిన్కు చూపించింది. ఆయన కూడా దాన్ని సాధారణంగానే తీసుకున్నారు. మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. ఆమెను ఇంకా ఎక్కువగా కామెంట్ చేయండి అంటూ అండ్రూ కామెంట్స్ చేసిన వారికి రిప్లై ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగులో 2019లో విడుదలైన సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ యన్.టి.ఆర్‌లో శ్రియా శరన్ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు. వెంకటేశ్‌తో సినిమా చేయాల్సింది కానీ.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత శ్రియా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout