శ్రియ.. డబుల్ ధమాకా

  • IndiaGlitz, [Tuesday,December 19 2017]

ప‌ద‌హారేళ్లుగా క‌థానాయిక‌గా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శ‌ర‌న్‌. ఇష్టంతో మొద‌లైన ఈమె సినీ ప్ర‌యాణం.. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, ఆంగ్లం.. ఇలా ప‌లు భాష‌ల్లో కొన‌సాగింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, త‌మిళ్‌, హిందీ చిత్రాల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఇప్ప‌టికే వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు, గాయ‌త్రి చిత్రాల్లో న‌టిస్తున్న శ్రియ‌.. త‌మిళంలో అర‌వింద్ స్వామితో న‌ర‌గాసుర‌న్ సినిమా చేస్తోంది.

అలాగే హిందీలో త‌డ్కా సినిమా చేస్తోంది. కాగా, వీటిలో మోహ‌న్‌బాబు, మంచు విష్ణు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న గాయ‌త్రి చిత్రం ముందుగా విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ చిత్రం విడుద‌లైన ఒక‌ట్రెండు వారాల్లోనే త‌మిళ చిత్రం నర‌గాసుర‌న్ కూడా విడుద‌ల కాబోతోంది. సందీప్ కిష‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా తెలుగులో న‌ర‌కాసురుడు పేరుతో రిలీజ్ కానుంది. అంటే.. ఒకే నెల‌లో శ్రియ రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌బోతోంద‌న్న‌మాట‌.