ఆర్ఆర్ఆర్‌లో శ్రియ... కన్‌ఫర్మ్ చేసిన నటి
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు స్టార్ హీరోలందరితో ఆడిపాడిన శ్రియా శరన్ పెళ్లి తర్వాత సినిమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటుంది. అయితే ఈమధ్య ఈమె వరుస సినిమాల్లో నటిస్తుంది. ఈ విషయాన్ని శ్రియాశరన్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆసక్తికరమైన విషయమేమంటే శ్రియ టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్‌లోనటిస్తుండటం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకులుగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ చాలా కీలకమైన పాత్రలో నటిస్తోన్నసంగతి తెలిసిందే. ఈయన జోడిగా శ్రియాశరన్ నటించనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. దీంతో పాటు ఓ లేడీ డైరెక్టర్ సినిమాలోనూ శ్రియ నటించనుంది. అలాగే తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తుందట. రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రియా శరన్ ఈ విషయాన్ని తెలియజేయడమే కాకుండా రజినీకాంత్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్‌కల్యాణ్ వంటి వారిని గురించి కూడా చెప్పడం విశేషం.
లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్‌కు పర్మిషన్ రాగానే భారీ సెట్‌లో ఆర్ఆర్ఆర్‌ను షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి రాజమౌళి అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com