తొలిసారి తన కొడుకు ఫోటో షేర్ చేసిన శ్రేయ ఘోషల్.. పేరు ఏంటంటే!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రేయ ఘోషల్ ప్రస్తుతం ఇండియాలో తిరుగులేని సింగర్. అన్ని భాషల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా శ్రేయ ఘోషల్ దూసుకుపోతోంది. ఆమె పాట పాడితే అది చార్ట్ బస్టర్ కావడం ఖాయం. అందుకే తెలుగు సంగీత దర్శకులు కూడా ప్రత్యేకంగా శ్రేయ ఘోషల్ తో పాడిస్తుంటారు.
ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2015లో షీలాదిత్య ముఖోపాధ్యాయ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు మే 22న పండంటి మగబిడ్డ జన్మించాడు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తొలిసారి శ్రేయ ఘోషల్ తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇదీ చదవండి: పిక్ టాక్ : కూతుర్ని కౌగిలించుకుని నిద్రలోకి జారుకున్న మహేష్
ఇన్స్టాగ్రామ్ లో అందమైన పోస్ట్ పెట్టింది. శ్రేయ ఘోషల్, షీలాదిత్య దంపతులిద్దరూ తమ కొడుకుని చూసుకుంటూ మురిసిపోతున్నారు. అదే విధంగా తన కొడుకు పేరుని కూడా శ్రేయ రివీల్ చేసింది. తన కొడుకుకి 'దేవ్యాన్ ముఖోపాధ్యాయ' గా నామకరణం చేసినట్లు తెలిపింది.
'మే 22న జన్మించిన ఈ చిన్నారి తమ జీవితాల్లో అందమైన మార్పు తీసుకువచ్చాడు. ఇది కలలా ఉంది. కేవలం తల్లి దండ్రులు మాత్రమే అనుభవించే అందమైన అనుభూతి ఇది' అంటూ శ్రేయ ఘోషల్ తన కొడుకుని పరిచయం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments