ప్రభాస్ తర్వాత శ్రేయ...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ శ్రేయ కాదులే సుమా...సింగర్ శ్రేయా ఘోషల్..ఇంతకు ప్రభాస్ తర్వాత శ్రేయాఘోషల్ ఏంటోనని తెగ ఆలోచించకుండి..అసలు విషయమేమంటే బ్యాంకాక్ మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో రీసెంట్గా బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ రెబల్‌స్టార్ మైనపు విగ్రహాన్ని ఈ మ్యూజియంలో ప్రతిష్టించనున్నారు.
ప్రధాని మోడీ తర్వాత ప్రభాస్‌కు మాత్రమే ఈ అరుదైన గుర్తింపు దొరికింది. ఇప్పుడు ప్రభాస్ తర్వాత శ్రేయోఘోషల్ మైనపు బొమ్మను ఈ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారట. ఈ విషయాన్ని శ్రేయాఘోషల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేయడం విశేషం. దక్షిణాది, ఉత్తరాదిన స్టార్ సింగర్‌గా పేరున్న శ్రేయాఘోషల్కు ఈ అరుదైన గుర్తింపు రానుండటం ఆనందించదగ్గ విషయమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout