శ్ర‌ద్ధాదాస్ స్పెష‌ల్‌

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

తెలుగు నుండి ఇటీవ‌ల శాండీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్ర‌ద్ధాదాస్‌.. త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుమోపింది. మొగుడు, గుంటూరుటాకీస్‌లో రివాల్వ‌ర్ రాణి స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్ర‌ద్ధాదాస్ త‌మిళంలో రూపొందుతున్న తెలుగు చిత్రం 'టెంప‌ర్‌' రీమ‌క్‌లో స్పెష‌ల్ సాంగలో విశాల్‌తో కాలు క‌దిపింది. వెంక‌ట్ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు విశాల్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం ముందుగా శృతిహాస‌న్‌, స‌న్నీలియోన్ వంటి తార‌ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. చివ‌ర‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు శ్ర‌ద్ధాదాస్‌నే తీసుకున్నారు. రీసెంట్‌గా ఈ స్పెష‌ల్‌సాంగ్‌ను భారీ సెట్ వేసి చిత్రీక‌రించార‌ట‌. మ‌హిళ‌ల‌పై జ‌ర‌గుతున్న అత్యాచారాల‌పై ఓ పోలీస్ ఆఫీస‌ర్ తీసుకున్న నిర్ణ‌య‌మే ప్ర‌ధానంగా ఈ సినిమా ఉంటుందనే సంగ‌తి తెలిసిందే.