ఐదేళ్ల వరకు ఊసే లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్, ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠ డేటింగ్ చేస్తున్నారని వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని వార్తలు వినపడ్డాయి. అయితే శ్రద్ధాకపూర్ తండ్రి సీనియర నటుడు శక్తి కపూర్ తన కుమార్తె వార్తలపై స్పందిస్తూ..''శ్రద్ధాకపూర్ పెళ్లి వార్తలన్నీ అబద్ధాలే. మరో ఐదేళ్ల వరకు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. రెండేళ్ల వరకు తన డైరీ కమిట్మెంట్స్తో నిండిపోయాయి. అలాగే శ్రద్ధ గత కొన్నేళ్లుగా రోషన్ శ్రేష్ఠను ప్రేమిస్తుందని కూడా వార్తలు వినపడ్డాయి.
ఇలాగే అంతకు ముందు మరి కొంత మంది పేర్లు కూడా వినిపించాయి. ఇది సినిమా ఇండస్ట్రీ. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా.. అలాగే అంటుంటారు. అంత మాత్రాన ఏదో అయినపోయినట్లు కాదు. రోషన్ తండ్రి రాకేష్ నాకు మంచి స్నేహితుడు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. శ్రద్ధ ప్రతి విషయం మాకు చెబుతుంది. మా అనుమతి లేకుండా ఆమె పెళ్లి చేసుకోదు'' అన్నారు శక్తి కపూపర్. దీంతో శ్రద్ధ పెళ్లిపై వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout