టాలీవుడ్ సినిమా రీమేక్‌లో శ్రద్ధాకపూర్
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `ఓ బేబీ`. కొరియన్ మూవీ `మిస్‌గ్రానీ`కి ఇది తెలుగు రీమేక్. బి.నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా.. ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి నిర్మాత డి.సురేష్ బాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వినపడుతున్న సమాచారం ప్రకారం.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హిందీలో ప్రధాన పాత్రలోనటించనుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోయే ఈ సినిమా వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం శ్రద్దాకపూర్ నటించిన టాలీవుడ్ మూవీ `సాహో` ఆగస్ట్ 15న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com