హెచ్చరిక..న్యాయపరమైన చర్యలు తీసుకుంటా: శ్రద్ధాదాస్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుందని నిర్వాహకులు అధికారికంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ మొదటి వారంలో బిగ్బాస్ 4 స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. సోషల్ మీడియాలో బిగ్బాస్ 4 కంటెస్టెంట్స్ వీరేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలా బిగ్బాస్ కంటెస్టెంట్స్ అని వినిపిస్తున్న వారి పేర్లలో శ్రద్ధాదాస్ పేరు కూడా వినిపించింది. ఈ వార్తలను ఇది వరకే శ్రద్ధాదాస్ ఖండింది. ఇప్పుడు మరోసారి శ్రద్ధాదాస్ బిగ్బాస్ 4లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై శ్రద్ధాదాస్ సీరియస్ అయ్యారు. బిగ్బాస్ సీజన్ 4 కోసం తననెవరూ సంప్రదించలేదని తెలిపారు శ్రద్ధా.
‘‘బిగ్బాస్ తెలుగులో పార్టిసిపేట్ చేయాలంటూ నన్నెవరూ సంప్రదించలేదు. కానీ నేను బిగ్బాస్లో పాల్గొనబోతున్నానంటూ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అలాంటి వార్తలు రాసే ముందు నన్ను సంప్రదించి రాస్తే బావుంటుంది. అలా కాకుండా ఏదీ పడితే అది రాస్తే ఊరుకునేది లేదు. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఇదే నా మొదటి చివరి హెచ్చరిక’’ అంటూ శ్రద్ధాదాస్ వార్నింగ్ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout