కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో శ్రద్ధాదాస్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ శ్రద్ధాదాస్ ఇప్పుడు `పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం` చిత్రంలో జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” . ప్రస్తుతం సినిమా జార్జియాలో చిత్రీకరణను జరుపుకుంటుంది. రాజశేఖర్ ఈ చిత్రంలో ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్‌లోనే పాతిక కోట్లకు పై భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందుతుంది. మెయిన్ విలన్ జార్జ్ పాత్రలో కిషోర్ నటిస్తున్నాడు. హీరోయిన్ పూజా కుమార్, రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తుంది.
గుంటూరు టాకీస్ చిత్రంలో శ్రద్ధాదాస్ హిలేరియస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ ఈ చిత్రంలో మరో డిఫరెంట్‌గా కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి వలే తాను కూడా కావాలని కలలు కనే ఓ యంగ్ జర్నలిస్ట్ మనాలిగా బెంగాలీ యువతి అయిన శ్రద్ధాదాస్ అద్భుతంగా నటిస్తుంది. బేసిక్‌గా శ్రద్ధాదాస్ జర్నలిజం స్టూడెంట్ కావడంతో శ్రద్ధా పాత్రలో ఒదిగిపోయింది. అదిత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా కీలకపాత్రలో నటిస్తున్నాడు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్లస్ అవుతుంది. నాజర్, చరణ్ దీప్ తదితరులు రాజశేఖర్ ఎన్ఐఎ టీం సభ్యులుగా నటిస్తున్నారు. ఆదర్శ్, శత్రు, రవిరాజ్‌లు ప్రొఫెషనల్ కిల్లర్స్ పాత్రలో కనపడనున్నారు. శ్రీనివాస్ అవసరాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాలజిస్ట్ పాత్రలో, పృథ్వీ నింఫోమానియక్ పేషెంట్‌గా, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే పొలిటిషియన్స్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతంః శ్రీచరణ్ పాకాల, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్, సినిమాటోగ్రఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ రగుతు, శ్యామ్, ఎడిటింగ్ః ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్, డేవిడ్ కుబువా, సతీష్, బాబీ అంగారా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments