రీమేక్‌లో శ్రద్ధా శ్రీనాథ్‌..!

  • IndiaGlitz, [Sunday,December 23 2018]

తమిళ అగ్ర కథానాయకుల్లో ఒక‌రైన అజిత్ కీలక పాత్రలో బోనీ కపూర్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, తాప్సీ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన హిందీ చిత్రం ‘పింక్’కు ఇది రీమేక్. ‘ఖాకి’ దర్శకుడు హెచ్.వినోద్ దర్శకుడు.

అమితాబ్ పాత్రను తమిళంలో అజిత్ పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్రధారులైన ముగ్గురు అమ్మాయిలుగా ఎవరు నటిస్తారనే దానిపై పలువురి పేర్లు వినపడుతున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, నజ్రియా నజీమ్ పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ పేరు కూడా వినపడుతుంది.

కన్నడ ‘యూ టర్న్’ చిత్రంలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్, తర్వాత ‘విక్రమ్ వేద’ సహా కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తెలుగులో నానితో ‘జెర్సీ’లో నటిస్తుంది.

More News

వెబ్‌సిరీస్ నిర్మాణంలోకి మ‌హేష్‌

హీరోగానే కాకుండా `శ్రీమంతుడు` సినిమాతో ఎం.బి.ఎంటర్‌ైటెన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్టార్ట్ చేసిన మహేశ్ ఆ తదుపరి మరే సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మారలేదు.

టికెట్ ధ‌ర‌పై త‌గ్గిన జి.ఎస్‌.టి

కేంద్ర ప్ర‌భుత్వం 18 శాతం జి.ఎస్‌.టి ప‌న్ను విధించిన‌ప్పుడు సినిమా రంగ పరిశ్ర‌మ బెంబేలెత్తింది. ఎందుకంటే వంద రూపాయ‌ల కంటే ఎక్కువ‌గా ఉన్న టికెట్స్‌పై జి.ఎస్‌.టి 28 శాతం వ‌సూలు చేశారు. 

కార్ల వ్యాపారిగా ప్ర‌భాస్‌

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యు.వి. క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

శోభన్‌బాబు అవార్డుల ప్రదానం వివరాలు

అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శోభన్‌బాబు పేరుమీద పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుక డిసెంబర్ 25 సాయంత్రం 4 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు.

చిరంజీవి టైటిల్స్‌పైనే క‌న్నేశాడే!

న‌కిలీ, డా.స‌లీమ్ చిత్రాల స‌క్సెస్‌ల‌తో ప‌రావాలేదు అనిపించుకున్న విజ‌య్ ఆంటోని బిచ్చ‌గాడుతో మాత్రం సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. త‌ర్వాత విడుద‌లైన ..