గుంటూరు టాకీస్ లో రివాల్వర్ రాణి ని చూసి షాక్ అవుతారు - హీరోయిన్ శ్రద్దాదాస్
- IndiaGlitz, [Thursday,March 03 2016]
అధినేత, ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, మొగుడు, రేయ్...తదితర చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్రద్దాదాస్. తాజాగా శ్రద్దాదాస్ గుంటూర్ టాకీస్ సినిమాలో నటించింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ చిత్రం ఈనెల 4న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా గుంటూరు టాకీస్ గురించి హీరోయిన్ శ్రద్దాదాస్ ఇంటర్ వ్యూ మీకోసం...
గుంటూరు టాకీస్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు రివాల్వర్ రాణి. ఇది ఒక షాకింగ్ రోల్ అనే చెప్పాలి. శ్రద్దాదాస్ కి పూర్తి భిన్నంగా రివాల్వర్ రాణి క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్ కావాలి. ఆడియోన్స్ కూడా నా క్యారెక్టర్ చూసి షాక్ అవుతారు. ఇప్పటి వరకు మీరు చూసిన శ్రద్దాదాస్ వేరు..ఇందులో శ్రద్దాదాస్ వేరు. ఓ కొత్త శ్రద్దాదాస్ ని చూస్తారు. ఓక ఛాలెంజింగ్ తీసుకుని చేసిన నా క్యారెక్టర్ కి శ్రద్దాదాస్ కి మెంటల్ అని.. వావ్ భలే చేసింది అని...ఇలా రకరకాల కామెంట్స్ వస్తాయనుకుంటున్నాను.
రివాల్వర్ రాణి క్యారెక్టర్లో ఉన్న రెండు షేడ్స్ ఏమిటి..?
ప్లాష్ బ్యాక్ లో రివాల్వర్ రాణి క్యారెక్టర్ వస్తుంది. ఫస్టాఫ్ లో నా క్యారెక్ట్ లో మ్యాడ్ నెస్ కనిపిస్తే... సెకండాఫ్ లో యాంగ్రీ యాంగిల్ కనిపిస్తుంది.
కంగనా రనౌత్ రివాల్వర్ రాణి చూసారా..?
కంగనా రనౌత్ రివాల్వర్ రాణి చూసాను..ఆ సినిమా చూసి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అలాగే ఆ సినిమా స్పూర్తితో ఈ చిత్రంలో నటించాను.
ఇందులో రియల్ గన్స్ ఉపయోగించారట కదా..ఎలా అనిపించింది..?
అవును..ఈ సినిమాలో రియల్ గన్స్ ఉపయోగించాం...కాకపోతే అవి చాలా బరువుగా ఉండేవి. గన్స్ రియల్ బుల్లెట్స్ మాత్రం డమ్మీ. ఫైర్ చేస్తుంటే గట్టిగా సౌండ్స్ వచ్చేవి తట్టుకోవడం కాస్త కష్టం అయింది.
సీనియర్ ఎక్టర్స్ నరేష్, మహేష్ మంజ్రేకర్ లతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి..?
నరేష్ గారు...తెలుగు సినిమాకి ఓ పరేష్ రావెల్.. ఆయన సెట్ లో అప్పటి వరకు మాతో మాట్లాడుతునే ఉంటారు షాట్ రెడీ అని చెప్పగానే కెమెరా ముందుకు వెళ్ళి ఇట్టే నటించేస్తారు. అలా ఎలా చేయగలుగుతున్నారని ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇక మహేష్ మంజ్రేకర్ అయితే చాలా ప్రొఫిషినల్. ఇక హీరో సిద్దు గురించి చెప్పాలంటే...కొత్త అబ్బాయి అయినా ఎక్స్ పీరియన్స్ ఆర్టిస్ట్ లా నటించాడు. సినిమా రిలీజ్ తర్వాత సిద్దుకి మంచి పేరు తో పాటు మంచి ఆఫర్స్ వస్తాయని నా నమ్మకం.
మీ పుట్టినరోజు ఈనెల 4న కదా..ఎలా సెలబ్రెట్ చేస్తున్నారు..?
నా పుట్టినరోజు నాడే గుంటూరు టాకీస్ రిలీజ్ అవుతుంది. సో...గుంటూరు టాకీస్ నా బర్త్ డే గిఫ్ట్.
రేయ్ తర్వాత తెలుగులో నటించకపోవడానికి కారణం..?
రేయ్ రిజల్ట్ తర్వాత ఇక నా కెరీర్ అయిపోయింది... ఇక అవకాశాలు రావు అనుకున్నాను. చాలా డిప్రషన్ లోకి వెళ్లిపోయాను. అప్పుడు కన్నడలో పూజా అనే సినిమా చేసాను. ఆతర్వాత ప్రవీణ్ సత్తార్ ఫోన్ చేసి గుంటూరు టాకీస్ లో అవకాశం ఇచ్చారు. సో...ఫ్లాప్ సినిమా తర్వాత అవకాశాలు రావడం చాలా లక్కీ. చలా హ్యాఫీగా ఫీలవుతున్నాను.
మీ కెరీర్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది..?
తెలుగు, కన్నడ, మలయాళీ, బెంగాలీ, హిందీ...ఈ ఐదు భాషల్లో నటించాను. ఈ ఐదు భాషల్లో డిఫరెంట్ రోల్స్ లో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఐదు భాషల్లో నటిస్తున్నప్పటికీ ఈరోజు ముంబాయిలో నాకు సొంత ఇల్లు, కారు ఉన్నాయంటే దానికి కారణం తెలుగు సినిమానే.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
తెలుగు మూవీ డాన్ శీను బెంగాళీ రీమేక్ లో నటిస్తున్నాను.