చేతులెత్తి దండం పెడుతున్నా.. భారత్ సాయం కావాలి!

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

కరోనా మహమ్మారితో మన దాయాది దేశం పాకిస్థాన్ విలవిలలాడుతోంది. మొత్తం సుమారు 5వేలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 77 మంది మృతి చెందారు. రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతోందే తప్ప అస్సలు అదుపులోకి రావట్లేదు. ఒకానొక సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం చేతులు ఎత్తేసినట్లుగానే మాట్లాడారు. అయితే రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్ అక్తర్ రంగంలోకి దిగాడు. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాక్‌కు.. కరోనా రూపంలో పెద్ద గండి వచ్చి పడిందని.. దీన్ని నుంచి బయటపడేందుకు భారత్ పెద్ద మనసుతో ముందుకు రావాలని ఆయన అభ్యర్థించాడు. ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా, మీడియా ముఖంగా మాట్లాడిన ఆయన.. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు.

వీడియోలో ఏముంది..!?

‘మా దేశంలో కరోనా వైరస్‌ని నియంత్రించడానికి భారత్ సాయం చేయాలి. కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు లేవు. ఈ విషయంలో భారత్ మమ్మల్ని ఆదుకోవాలి (చేతులెత్తి దండి పెట్టి). మాకు ప్రస్తుతం 10వేలకు పైగా వెంటిలేటర్లు అవసరం ఉంది. అవి లేకపోవడం వల్ల పాక్‌లో మరణాల రేటు ఎక్కువగా ఉంది. మాకు సాయం చేయడానికి భారత్‌ ముందుకు రావాలి. విభేదాలను పక్కన పెట్టి మానవతా కోణంలో మాకు సాయం చేయాలి. కరోనా విషయంలో ఇరు దేశాలు ఏకం కావాలి’ అని దండంపెట్టి మరీ వేడుకున్నాడు. కాగా.. ఇప్పటికే అగ్రరాజ్యం అయిన అమెరికా విజ్ఙప్తిని మన్నించిన భారత్.. హైడ్రాక్సి క్లోరోక్విన్‌ ఎగుమతికి అంగీకరించిన విషయం విదితమే. మరి పాక్‌ విషయంలో భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో జస్ట్ వెయిట్ అండ్ సీ..!

More News

ఇండియాపై న్యూయార్క్ స్వాతి వీడియో.. నెట్టింట్లో వైరల్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన ఎవరెప్పుడు పడుతున్నారో..? ఎంతమంది చనిపోతున్నారా లెక్కలు తెలియని పరిస్థితి.

మరో 2వారాల పాటు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రధాని అంగీకారం!?

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఏప్రిల్-14తో లాక్‌డౌన్ ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు వారాల పాటు పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

‘రెడ్‌’ రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రామ్‌

కోవిడ్ 19 దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే కుదేల‌వుతుంది. భార‌త‌దేశం విష‌యానికి వ‌స్తే మ‌న‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క‌రోనా ప్ర‌భావం గ‌ట్టిగానే ప‌డింది. ప‌లు రంగాలు కుంటుప‌డ్డాయి.

నాని ‘వి’ సినిమాకు భారీ ఆఫ‌ర్‌.. నిర్మాత‌లు ఒప్పుకుంటారా?

నేచురల్ స్టార్ నాని, మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘వి’. ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌గా..సుధీర్ బాబు అత‌న్ని

బన్నీ సినిమాలో బాలీవుడ్ విలన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.