బంగారు పుష్పాల గుట్టు రట్టుకు సిద్ధమైన దేవాదాయశాఖ..

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

శ్రీవారి బంగారు పుష్పాల గుట్టు రట్టు చేసేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది. దొంగ రసీదులతో బంగారం సేకరించినట్లు ఆధారాలు దొరకడంతో దేవాదాయ శాఖ శ్రీవారి ఆలయ అర్చకుడికి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. 2017-18లో హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీ శ్రీవెంకటేశ్వర, భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవాలయంలో 108స్వర్ణ పుష్పాలు చేయించాలని అప్పటి ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అయితే 108 స్వర్ణ పుష్పాల కోసం 108 గ్రాముల బంగారం అవసరమైంది. దీనిని విరాళాల ద్వారా సేకరించాలని అప్పటి ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. అయితే 108 గ్రాముల బంగారాన్ని సేకరించడానికి బదులు కొందరు పెద్ద మొత్తంలో బంగారాన్ని సేకరించారు.

బంగారం సేకరణపై పెద్ద ఎత్తున రగడ మొదలైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మొత్తం బంగారానికి సంబంధించి వివరాలను సేకరించారు. ఆ తరువాత తనే బాధ్యత తీసుకుని 108 పుష్పాలతోపాటు మిగిలిన బంగారంతో స్వర్ణపీట తయారు చేయించారు. దీంతో అప్పటికి వివాదం సద్దుమణిగిపోయింది. కాగా.. తాజాగా ఇది మరోసారి వివాదాస్పదంగా మారింది. దీనికి కారణం.. తాజాగా సువర్ణ పుష్పాల దాతలతో కూడిన బోర్డును ఆలయంలో ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 136 గ్రాముల బంగారం దాతల పేర్లను పొందుపర్చారు. దీనిని చూసిన ఓ భక్తుడు షాక్ అయ్యాడు. తను ఇచ్చిన 30 గ్రాముల బంగారం తాలూకా లెక్క బోర్డుమీద కనిపించలేదని దేవాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

మళ్లీ కథ మొదటికి వచ్చింది. సదరు భక్తుడు తాను బంగారం ఇచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించాడు. దీంతో కంగుతిన్న అధికారులు మరోసారి విచారణ నిర్వహించి దీనికి ఆలయ అర్చకుడు శశికుమార్ శర్మగా తేల్చారు. నకిలీ రసీదుతో శశికుమార్‌ శర్మ 30 తులాల బంగారం పక్కదారి పట్టించినట్లు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ విచారణలో తేలింది. దీంతో కమిషనర్‌ మంగళవారం శశికుమార్‌ శర్మకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. వెంటనే బంగారం తాలూకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ భక్తుడు ఒక్కరి నుంచేనా.. లేదంటే మరికొంత మంది నుంచి బంగారం సేకరించారా? అనేది తేల్చేందుకు విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు.

More News

ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య..

ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర(28) బుదవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నై న‌జ‌ర‌త్ పేట్టైలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌‌లో

వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు..

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.

దీపికకు మరో అరుదైన గుర్తింపు

మన దక్షిణాది అమ్మాయి.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొనెకి అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది.

పవన్ ఎంట్రీతో నిహారిక పెళ్లి వేడుకలో మరింత జోష్...

నిహారికా కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం సాయంత్రం జరగనుంది. అయితే మంగళవారం సాయంత్రం వరకూ ఒక లెక్క..

సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు కారణం ఇదేనట..

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు సంబంధించిన మిస్టరీని కొంతమేరకు అధికారులు ఛేదించారు.