రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసు జారీ.. స్పందించిన ఎంపీ

ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైసీపీ తరుఫున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసును జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు.. అధినాయకత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారం లోగా సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తనకు పంపిన షోకాజ్ నోటీసుపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తనకు షోకాజ్ నోటీసు అందిందని.. 18 పేజీలలో రెండు పేజీలు మాత్రమే నోటీసుకు సంబంధించిన అంశాలని.. మిగిలినవి వివిధ పత్రికల క్లిప్పింగ్స్ అని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. తాను ప్రభుత్వం చేపట్టిన లోపాల గురించి మాత్రమే ప్రస్తావించానని.. పార్టీని కానీ జగన్‌ను కానీ విమర్శించలేదన్నారు. రేపే విజయసాయిరెడ్డికి వివరణ పంపిస్తానన్నారు.

More News

సుశాంత్ పోస్ట్‌మార్టం తుది నివేదిక ఏం తేల్చిందంటే...

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం తుది నివేదక వచ్చేసింది. ఆయన మృతి పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

'ఆటో రజని 'సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఏపీ మంత్రివర్యులు కొడాలి నాని

శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్  పై  జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఆటో రజని" ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన  డాన్స్ లతో

మరోసారీ రోజాకు నిరాశేనా?

ఏపీలో మళ్లీ మంత్రి పదవుల కలకలం రేగింది. అయితే నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకు మాత్రం ఈసారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

భూ వివాదంలో నిర్మాత పీవీపీ

విజ‌య‌వాడ వైసీపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి, నిర్మాత‌ ప్ర‌సాద్ వి.పొట్లూరిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

త‌మ‌న్నా ఓటీటీ డీల్‌..!

ప‌దిహేనేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందం, అభిన‌యాల‌తో అల‌రిస్తోన్న హీరోయిన్ త‌మ‌న్నా.