Tamil »
Interviews »
నెక్ట్స్ సీన్ ఏమిటని ఇంట్రస్టింగ్ గా చూసే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ శౌర్య - దర్శకుడు దశరథ్
నెక్ట్స్ సీన్ ఏమిటని ఇంట్రస్టింగ్ గా చూసే థ్రిల్లింగ్ లవ్ స్టోరీ శౌర్య - దర్శకుడు దశరథ్
Tuesday, March 1, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సంతోషం, సంబరం, స్వాగతం, శ్రీ , మిస్టర్ పర్ ఫెక్ట్, గ్రీకువీరుడు...ఇలా కుటుంబ కథా చిత్రాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించే దర్శకుడు దశరథ్. మంచు మనోజ్ - రెజీనా జంటగా దశరథ్ తెరకెక్కించిన తాజా చిత్రం శౌర్య. ఈ చిత్రాన్ని శివ కుమార్ నిర్మించారు. ఈ నెల 4న శౌర్య ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా శౌర్య గురించి దర్శకుడు దశరథ్ తో ఇంటర్ వ్యూ మీకో్సం...
శౌర్య ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
ఈసారి డిపరెంట్ స్టోరీతో సినిమా చేయాలనుకున్నాను. ఈ కథ గురించి మనోజ్ కి చెప్పాను. మనోజ్ కి చాలా బాగా నచ్చింది. ఆతర్వాత అనుకోకుండా నిర్మాత శివకుమార్ గార్ని కలవడం జరిగింది. ఆయనకి ఈ కథ గురించి చెబితే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
ఇంతకీ..శౌర్య కథ ఏమిటి..?
శౌర్య ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరి. ఇంతకు మించి ఏం చెప్పినా కథ తెలిసిపోతుంది కాబట్టి శౌర్య కథ ఏమిటనేది తెరపై చూడాల్సిందే. కాకపోతే సినిమా చూస్తున్నంత సేపు నెక్ట్స్ ఏం జరుగుతుందో అని ఇంట్రస్టింగ్ గా చూసేలా ఉంటుంది. రామచంద్రాపురం లాంటి విలేజ్ లో కాకినాడ లాంటి టౌన్ లో జరిగే కథ ఇది.
శౌర్య కథ ఎలా పుట్టింది..?
ఇలాంటి కథ చేద్దాం అనుకున్నాను అందుకే పుట్టింది. (నవ్వుతూ..) ఒక లవ్ స్టోరి చేయాలనుకున్నాను. అది చాలా ఇంట్రస్టింగ్ గా ఉండాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. రెగ్యులర్ గా ఉండే లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది.
ఇందులో ఓ క్రైమ్ ఎలిమెంట్ ఉంటుందని విన్నాం. ఏమిటది..?
అదే ఈ కథలో ఉన్న స్పెషాలిటి. అది కాస్త ఇప్పుడు చెప్పేస్తే ఎలా..? (నవ్వుతూ..)
మనోజ్ విషయానికి వస్తే...చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు...మోహన్ బాబు గారు అయితే మనోజ్ ని ఎలా చూడాలనుకున్నానో అలా శౌర్యలో
కనిపిస్తున్నాడన్నారు. మనోజ్ గెటప్ ని, క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేసారు..?
మనోజ్ క్యారెక్టర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అందుచేత క్యారెక్టర్ తగ్గటే గెటప్ సాఫ్ట్ గా కనిపించేలా చేసాం. ఇక హీరో క్యారెక్టర్ విషయానికి వస్తే..జీవితంలో బాగా డబ్బులు సంపాదించుకోవాలి..బాగా స్ధిరపడాలి అనే లక్ష్యం ఉన్నవాడు. దాని కోసం కష్టపడే వ్యక్తి. హీరోయిన్ విషయానికి వస్తే...బాగా చదువుకున్న అమ్మాయి. ఇలాంటి వాళ్లకి లవ్ లో ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుంది..? ఆ ప్రాబ్లమ్ ని ఎలా పరిష్కరించుకున్నారు అనేదే శౌర్య కథ.
మనోజ్ అంటే ఎనర్జిటిక్ గా ఉంటాడు కదా...మరి సాఫ్ట్ గా ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది..?
ఈ సినిమాలో మనోజ్ చాలా మంచోడు. ఏం జరిగినా మనసులోనే దాచుకుంటాడు తప్ప బయటకు చెప్పడు. ఇక తప్పదు అనుకుంటేనే బయటకు చెబుతాడు. సినిమాలో ఫైట్స్ లేవు. వార్నింగ్ ఇచ్చే సీన్స్ లేవు. ఛేజ్ లు లేవు. కానీ సినిమా చూస్తున్నంత సేపు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. క్యారెక్టర్ కి తగ్గట్టు మనోజ్ చాలా బాగా నటించాడు.
ఈ సినిమాలో మనోజ్ ఇన్ వాల్వెమెంట్ ఎంత..? ఇంటర్ ఫియరెన్స్ ఎంత..?
మనోజ్ కి కథ చెప్పడమే సీన్ టు సీన్ పూర్తి కథ చెప్పాను. అంతే కానీ..లైన్ చెప్పడం...తర్వాత డెవలప్ చేయడం ఇలా చేయలేదు. దీంతో మనోజ్ ఏమన్నాడంటే...చిన్న బాబులా వస్తాను సీన్ చేస్తాను వెళ్లిపోతాను అని చెప్పాడు.నిజంగా అలాగే చేసాడు. తప్ప కావాలని ఇంటర్ ఫియర్ అవ్వడం లాంటిదేమి జరగలేదు.
శౌర్య టైటిల్ విషయానికి వస్తే...సంతోషం, సంబరం, స్వాగతం, శ్రీ...ఇలా ఇంగ్లీషు అక్షరం ఎస్ తో స్టార్ట్ అయ్యేలా టైటిల్ పెడతారు కదా. సెంటిమెంట్
ప్రకారమే శౌర్య టైటిల్ పెట్టారా..?
నాకు అసలు అలాంటి సెంటిమెంటే లేదండీ. సెంటిమెంట్ ని నేను వదిలేసినా నన్ను వదలడం లేదు. మిస్టర్ పర్ ఫెక్ట్ , గ్రీకువీరుడు ఎస్ తో స్టార్ట్ కావు కదా. ఈ సినిమా నిర్మాత శివ కుమార్ గార్కి ఎస్ సెంటిమెంట్ ఉందట. ఆయన బ్యానర్ పేరు సురక్ష ఎంటర్ టైన్మెంట్. ఈ బ్యానర్ లో రూపొందిన గత చిత్రం సూర్య వెర్షెస్ సూర్య. ఆయన పేరు శివకుమార్. ఇలా ఆయనకు ఎస్ సెంటిమెంట్. అందుచేత ఆయన ఎస్ తో టైటిల్ కావాలంటే పెట్టాను అంతే.
ఈ సినిమాకి హైలెట్ ఏమిటి అంటే ఏం చెబుతారు..?
కథ - కథనం కొత్తగా ఉంటాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. వీటితో పాటు మనోజ్ - రెజీనా - ప్రకాష్ రాజ్ ఈ మూడు క్యారెక్టర్స్ హైలెట్ గా నిలుస్తాయి.
ఈ సినిమా ద్వారా మీ బ్రదర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసారు కదా..?
ఇంతకు ముందు చెప్పినట్టు తక్కువ బడ్జెట్ లో చేద్దాం అనుకున్నాం. తమ్ముడు సీరియల్స్ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే చిన్ని సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ చేయాలని చెప్పడంతో నాలుగు ట్యూన్స్ రెడీ చేసి వినిపించాడు అవి ప్రొడ్యూసర్ గార్కి, హీరో మనోజ్ కి నచ్చడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మా నమ్మకానికి తగ్గట్టు ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
మీ సినిమాల విషయానికి వస్తే...ఇప్పటి వరకు సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ ఈ రెండూ బ్లాక్ బష్టర్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలే బ్లాక్ బష్టర్స్ గా నిలవడానికి కారణం ఏమిటి..? మిగిలిన మీ చిత్రాలు ఆరేంజ్ సక్సెస్ సాధించకపోవడానికి కారణం ఏమిటి..?
ఆ రెండు చిత్రాలు జనానికి బాగా నచ్చాయి. మిగిలినవి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే ప్రధాన లోపం నాలోనే ఉండచ్చు.
అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడతాం కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతుంది అంతే
గ్రీకువీరుడు సెకండాఫ్ సరిగాలేదు...అందులోను క్వాలిటీ సరిగా లేదు అందువలన సినిమా ఆడలేదనుకోవచ్చా..?
సెకండాఫ్ క్వాలిటీ సరిగా లేదు నిజమే కాకపోతే దానికి కారణం వేరే ఉంది. అయితే క్వాలిటీ సరిగా లేకపోవడం వలన సినిమా ఆడలేదు అంటే నేను నమ్మను. కంటెంట్ ఏదో మిస్ అవ్వడం వలనే ఆడలేదు అనుకుంటున్నాను. సెకండాఫ్ కనెక్ట్ కాలేకపోవడం వలనే ఆడలేదు అని నా అభిప్రాయం. నాకు తెలిసిన కొంత మంది మిత్రలు ఏమన్నారంటే నువ్వు కాకుండా వేరే వాళ్లు తీసుంటే బాగుండేదేమో అన్నారు. ఎందుకని అలా అన్నారంటే...నువ్వు నెక్ట్స్ ఎలా తీసుంటావో అర్ధమైపోతుంది అన్నారు. అది కూడా ఓ కారణం అయిండోచ్చు అనుకుంటున్నాను.
దర్శకుడిగా మీ టార్గెట్ ఏమిటి..?
ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇంకో రెండు మూడు సినిమాలు తీయాలనేదే నా టార్గెట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments