మంచు మనోజ్ శౌర్య ఫస్ట్ సాంగ్ రిలీజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం శౌర్య. ఈ చిత్రాన్ని దశరథ్ తెరకెక్కిస్తున్నారు. సురక్ష ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శివకుమార్ నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న శౌర్య షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. క్రిస్మెస్ కానుకగా శౌర్య సినిమాలో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ...ఇటీవల రిలీజ్ చేసిన శౌర్య మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గీత రచయిత క్రిష్ణ చైతన్య రాసిన పాటను ఈరోజు లాంఛ్ చేసాం. ఈ సినిమాలో మనోజ్ ను సరికొత్తగా చూపిస్తున్నాం. ఫ్యామిలీ అంతా కలసి చూసే మంచి సినిమా ఇది అన్నారు.
హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ... ఈ సినిమాలో నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన శౌర్య నా కెరీర్ లో మంచి సినిమా అవుతుంది అన్నారు.
నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ...దశరథ్ గారి ప్లానింగ్ తో సినిమాను అనుకున్న విధంగా, అనుకున్న టైం కి పూర్తి చేసాం. జనవరి ఫస్ట్ వీక్ లో ఆడియోను, జనవరి నెలాఖరున సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, నందు, జీవి, మధుమణి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com