మనోజ్ 'శౌర్య' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్నచిత్రం శౌర్య. మంచు మనోజ్, రెజీనా నాయకనాయికలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్లారమెంట్ సభ్యుడు వి.బి.పాటిల్ ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యుడు వి.బి.పాటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. సినిమా చివరి షెడ్యూల్ డిసెంబర్ 6న పూర్తవుతుంది. డిసెంబర్ 31కి ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. లవ్ థ్రిలర్ మూవీ. జనవరిలో సినిమా విడుదలకు ప్లాన్స్ జరుగుతున్నాయని దర్శకుడు దశరథ్ అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. మాస్ సినిమాలు చేసే నేను, క్లాస్ సినిమాలు చేసే దశరథ్ కలిసి చేస్తున్న డిఫరెంట్ మూవీ. నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తున్నారు. ఫాస్ట్ ఫేస్‌లో సాగే లవ్ థ్రిల్లర్ మూవీ అని మంచు మనోజ్ అన్నారు.
సూర్య వర్సెస్ సూర్య తర్వాత మా బ్యానర్లో రూపొందుతోన్న చిత్రమిది. మనోజ్, రెజీనా సహా అర్టిస్ట్స్, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తున్నాం. మా సంస్థకు మంచి పేరు, డబ్బును తెచ్చే చిత్రమవుతుంది. జనవరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలియజేశారు. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నానని నాగినీడు తెలిపారు. హీరోయిన్ తల్లిగా నటిస్తున్నానని సుధ తెలియజేశారు. కార్యక్రమంలో రెజీనా కూడా పాల్గొన్నారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్, బెనర్జీ, జి.వి., ప్రభాస్ శ్రీను, షకక శంకర్, సత్యప్రకాష్, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్, చంద్రకాంత్, రూప ఇతర తారాగణం. ఈ చిత్రానికి స్టంట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్, రచన: గోపి మోహన్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మ్హర్భట్ జోషి, నిర్మాత: శివకుమార్ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com