మనోజ్ ను నేను చూడాలనుకున్న క్యారెక్టరే 'శౌర్య' - మోహన్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం శౌర్య``. థ్రిల్లర్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వేదా.కె. సంగీం అందించిన ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు మోహన్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని బిగ్ సీడీ, థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. బి.గోపాల్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ...
మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ ``నేను ఇన్ని రోజులు ఎలాంటి పాత్రలో మనోజ్‌ను చూడాలనుకున్నానో అలాంటి పాత్రలో మనోజ్ కనిపిస్తున్నాడు. దర్శకుడు దశరథ్ మా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. గతంలో మనోజ్, దశరథ్ కలిసి శ్రీ అనే సినిమా చేశాను. ఇప్పుడు శౌర్య చేశారు. వేదా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వేదా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ ``దర్శకుడు దశరథ్ అన్నీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలనే డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కూడా అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవాలి`` అన్నారు.
దశరథ్ మాట్లాడుతూ ``శౌర్య రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉండే కాన్సెప్ట్ బేస్డ్ లవ్ స్టోరీ. మనోజ్ కారణంగానే శౌర్య చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో తను చాలా కొత్తగా కనిపిస్తాడు. శివకుమార్ చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. మంచి మిత్రుడుగా మారిపోయారు. రెజీనా, మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫీ, వేదా మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వేదా.కె మాట్లాడుతూ ``ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, మనోజ్ అన్నకు థాంక్స్`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలోరెజీనా, బ్రహ్మానందం, ఎన్.శంకర్, రసమయి బాలకిషన్, నిర్మాత శివకుమార్, వీరశంకర్, చంద్రమహేష్, గొట్టిముక్కల పద్మారావు, శ్రీవాస్, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, షాయాజీషిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్, బెనర్జీ, జి.వి., ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, సత్యప్రకాష్, సూర్య, శివారెడ్డి, సుధ, మధుమణి, హేమ, సంధ్యాజనక్, చంద్రకాంత్, రూప ఇతర తారాగణం. ఈ చిత్రానికి స్టంట్స్: వెంకట్, కొరియోగ్రఫీ: భాను, ఆర్ట్: హరిబాబు, రచనా సహకారం: హరికృష్ణ, సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే: గోపు కిషోర్, రచన: గోపి మోహన్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: వేదా.కె, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: శివకుమార్ మల్కాపురం, దర్శకత్వం: దశరథ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments