గ్యాప్ తీసుకోవాల్సిందే!!
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ పరిస్థితి అంతగా బాగున్నట్లు లేదు. ఎందుకంటే, ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన యన్.టి.ఆర్ అనుకున్న మేర సక్సెస్ కాలేదు. అలాగే మణికర్ణిక విషయంలో మొత్తం క్రెడిట్ అంతా కంగనాకే వెళ్లిపోయింది. దీంతో క్రిష్ ఓ రకంగా కాస్త డిప్రెషన్లోకి వెళ్లాడు. అయితే తదుపరి సినిమాను వెంటనే స్టార్ట్ చేయకుండా కాస్త గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడట.
కాస్త రిలాక్స్ అయ్యి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పనిచేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగా ముందు తన స్వంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమా, బాహుబలి చిత్రాన్ని నిర్మించిన ఆర్కామీడియా వర్క్స్ బ్యానర్‌పై మరో సినిమా చేయబోతున్నాడట. ఏది ముందు స్టార్ట్ చేస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments