మేసిందంతా మే-23 తర్వాత వడ్డీతో సహా కక్కాలి..!
Send us your feedback to audioarticles@vaarta.com
మొన్నటి వరకూ సీబీఐ మాజీ జేడీ, జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నారాయణ- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ జరిగిన సంగతి తెలిసిందే. అది కాస్త సద్దుమణిగే సరికి ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో విజయసాయి యుద్ధం మొదలెట్టారు. గత రెండ్రోజులుగా వీరిరివురి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విజయసాయి ట్విట్టర్ వేదికగా తీవ్ర దుమారం రేపే ట్వీట్స్ చేస్తుంటే.. కుటుంబరావు మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు.
కుటుంబ రావు ఏమన్నారు..!?
కాగా.. రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయంటూ విజయసాయిరెడ్డి పిచ్చికుక్కలా అరుస్తున్నారని.. గతంలో కంటే ఈ ఏడాది అప్పులు తక్కువగా ఉన్నాయని.. ఆర్థిక అంశాలపై దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంతటితో ఆగని ఆయన తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయి దొంగ ఆడిటర్ కాదా? అని ప్రశ్నించారు. బెయిల్ పై వచ్చి బతుకుతున్న పిచ్చి కుక్క విజయసాయిరెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా విజయసాయి ఘాటుగా స్పందించారు.
విజయసాయి కౌంటర్..
"కుటుంబరావు గారూ.. స్వైన్ ఫ్లూ మాదిరిగా చంద్రబాబు వైరస్‌ను వ్యాప్తిచేసే గుంపులో మీరొకరు. అవినీతి, అక్రమార్జనే ఆక్సిజన్‌గా బతికే సమూహాలు మీరంతా. అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలక నీతులు వల్లిస్తారా? మే 23 తర్వాత మీ బతుకులు రోడ్డున పడతాయి. మేసిందంతా వడ్డీతో సహా కక్కాలి" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు విజయసాయిపై టీడీపీ అభిమానులు, పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments