మేసిందంతా మే-23 తర్వాత వడ్డీతో సహా కక్కాలి..!

  • IndiaGlitz, [Monday,April 29 2019]

మొన్నటి వరకూ సీబీఐ మాజీ జేడీ, జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నారాయణ- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ జరిగిన సంగతి తెలిసిందే. అది కాస్త సద్దుమణిగే సరికి ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో విజయసాయి యుద్ధం మొదలెట్టారు. గత రెండ్రోజులుగా వీరిరివురి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విజయసాయి ట్విట్టర్ వేదికగా తీవ్ర దుమారం రేపే ట్వీట్స్ చేస్తుంటే.. కుటుంబరావు మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు.

కుటుంబ రావు ఏమన్నారు..!?

కాగా.. రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయంటూ విజయసాయిరెడ్డి పిచ్చికుక్కలా అరుస్తున్నారని.. గతంలో కంటే ఈ ఏడాది అప్పులు తక్కువగా ఉన్నాయని.. ఆర్థిక అంశాలపై దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంతటితో ఆగని ఆయన తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయి దొంగ ఆడిటర్ కాదా? అని ప్రశ్నించారు. బెయిల్ పై వచ్చి బతుకుతున్న పిచ్చి కుక్క విజయసాయిరెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా విజయసాయి ఘాటుగా స్పందించారు.

విజయసాయి కౌంటర్..

కుటుంబరావు గారూ.. స్వైన్ ఫ్లూ మాదిరిగా చంద్రబాబు వైరస్‌ను వ్యాప్తిచేసే గుంపులో మీరొకరు. అవినీతి, అక్రమార్జనే ఆక్సిజన్‌గా బతికే సమూహాలు మీరంతా. అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించింది చాలక నీతులు వల్లిస్తారా? మే 23 తర్వాత మీ బతుకులు రోడ్డున పడతాయి. మేసిందంతా వడ్డీతో సహా కక్కాలి అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్‌కు విజయసాయిపై టీడీపీ అభిమానులు, పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

More News

ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల ఫ‌లితాలుంటాయ్: జనసేన

రాజ్యాధికారం చేప‌ట్టడానికి బ‌హుజ‌న స‌మాజ్ వాది పార్టీకి 25 ఏళ్లు ప‌డితే.. జ‌న‌సేన పార్టీ మాత్రం ఐదేళ్లలో సాధించ‌బోతోందని ‌పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం తెలిపారు.

ఎస్ ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి 'రాజావారు రాణిగారు'

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో  ఆడు రాయాల్సిన ప‌రీక్ష ఒక‌టుంది  ,  గీతా గీతా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌వే..... ఓక సారి ఎంపైర్ ఔట్ అంటే ఔటే..

తెలంగాణలో వరుస దారుణాలు.. పోలీసులకు సవాల్!

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అబలలపై అఘాయిత్యాల ఎక్కువవుతున్నాయి. గత వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో నాలుగైదు దారుణ

సినిమా షూటింగ్‌లో మహేష్‌తో పరిచయం, ప్రేమ.. చివరికి విషాదం!

సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఆరునెలలపాటు చెట్టాపట్టాలేసుకుని ఆ ప్రేమబంధం చివరకు ఆ యువతి ప్రాణాలను బలిగొనేలా చేసింది.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం!?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిపోయి.. కాలరాస్తున్నాడని వైసీపీ సీనియర్ నేత విజయచందర్‌ ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడలో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ