రాజ్‌తరుణ్ 'లవర్' షూటింగ్ పూర్తి.
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల' తో సక్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులదరికీ చాలా దగ్గరయ్యారు.ఇప్పుడు సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'లవర్' సినిమాలో నటిస్తున్నారు.
'అలా ఎలా?' వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టకున్న దర్శకుడు అనీశ్ కృష్ణ దర్శకుడు. శిరీశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. హర్షిత్ రెడ్డి నిర్మాత.
ప్రేమలోని సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ అనీశ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి ఆడియన్స్ నుండి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కెమెరా: సమీర్ రెడ్డి, మ్యూజిక్: అంకిత్ తివారి, రిషి రిచ్, అర్కో, తనీశ్ బాగ్చి, సాయికార్తీక్, బ్యాగ్రౌండ్ స్కోర్: జె.బి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, స్టంట్స్: విజయ్, వెంకట్, రామకృష్ణ, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి, నిర్మాత: హర్షిత్ రెడ్డి, రచన, దర్శకత్వం: అనీశ్ కృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments