హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు కలకలం
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు కలకలం సృష్టించాయి. బస్సు నెంబర్ ఏపీ 28 జె 4468 బస్సులు కాల్పులు జరిగాయి. నగరంలోని పంజాగుట్ట దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఓ గుర్తుతెలియని వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. బస్సు రూప్‌టాప్ (పైభాగం) నుంచి బుల్లెట్ బయటికి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది ఊపిరిపీల్చుకుంది.
ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపింది ఇతడే!
భాగ్యనగరంలోని ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీని పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టేశారు.! నగరంలోని పంజాగుట్టలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో గొడవ సందర్భంగా బస్సు రూఫ్ టాప్ పైకి ఓ వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్, కండక్టర్ వాంగ్మూలం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసే కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించారు.
ఇతడు నగరంలోని ఒక ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ప్రయాణికులతో గొడవపడి కాల్పులు గాల్లోకి కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఏపీ డీజీపీ ఠాకూర్‌కు సమాచారమిచ్చారు. దీనిపై ఆయన ఏపీ డీజీపీ స్పందిస్తూ.. శ్రీనివాస్ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. జనాల మధ్య కాల్పులు జరపడం చాలా పెద్ద నేరమన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout