ప్రెస్మీట్లో జీవీఎల్ పై చెప్పు విసిరిన డాక్టర్!
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలోలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్‌మీట్ ప్రారంభమైన కొద్దిసేపటికే అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. జీవీఎల్ మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరాడు. కాగా ఆ చెప్పు ఆయనకు తగల్లేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు, పోలీసులు చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆఫీసులోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
కాగా ఆ వ్యక్తి బీజేపీ ఉద్దండ నేత అద్వానీ విరాభిమాని అని తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన డాక్టర్ శక్తి భార్గవగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.ప్రస్తుతం అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కమలానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అసలెందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడు..? ఈయనతో ఎవరైనా ఇలా చేయించారా..? జీవీఎల్‌కు ఆ వ్యక్తికి ఏమైనా గొడవలున్నాయా? వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు అసలు ఆయన బీజేపీ కార్యకర్తేనా లేకుంటే మీడియా ముసుగులో వచ్చి ఎవరైనా ఇలా దాడి చేయించారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. యూపీ నుంచి జీవీఎల్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే బీజేపీ అధిష్టానం ఒకప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తులా కృషి చేసిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ లాంటి సీనియర్ నేతలకు పార్టీలో వరుసగా ఎదురవుతున్న అవమానాలతోనే భార్గవ ఇలా కక్షగట్టి చెప్పుతో దాడి చేసి ఉంటాడని సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments