వివేకా హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్.. పేర్లు బయటికొచ్చాయ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలువుర్ని పోలీసులు, కోర్టులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ హత్యలో తనకు కొందరిపై అనుమానాలున్నాయని వివేకా కుమార్తె వైఎస్ సునీత హైకోర్టును ఆశ్రయించి రిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అనుమానితుల పేర్లతో కూడిన జాబితాను ఆమె హైకోర్టుకు సమర్పించారు.
వైఎస్ ఫ్యామిలీ పేర్లే..!
అయితే ఈ పేర్లలో చాలా వరకూ అందరూ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వారే ఉండటం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆయన అత్యంత సన్నిహితుడు, తండ్రి పేర్లు కూడా ఉండటంతో మరోసారి ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు టీడీపీ నేతల పేర్లు కూడా ఉండటంతో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
జాబితాలోని పేర్లు ఇవే..!
వాచ్‌మన్ రంగయ్య
ఎర్ర గంగిరెడ్డి
వైఎస్ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి
పరమేశ్వర్‌రెడ్డి
శ్రీనివాసరెడ్డి
వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి
వైఎస్ మనోహర్‌రెడ్డి
వైఎస్ అవినాష్‌రెడ్డి
సీఐ శంకరయ్య
ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి
ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
పేర్లు ఎలా సేకరించారు!?
కాగా.. ఈ పేర్లన్నీ ఎలా తెలుసుకున్నానో అనే విషయం కూడా సునీత రిట్లో వివరంగా పేర్కొన్నారు. ఘటనాస్థలంలో ఉన్నవారితో పాటు సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం కొందరిపై అనుమానంతో వారి పేర్లను హైకోర్టుకు సమర్పిస్తున్నట్లు సునీత మీడియాకు వెల్లడించారు.
రియాక్షన్ ఏంటో!?
ఇదిలా ఉంటే.. ఈ కేసు వ్యవహారంపై ఫిబ్రవరి-06న హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేసిన విషయం విదితమే. అయితే ఈ జాబితాపై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది..? జాబితాలో పేర్లున్న వారు ఎలా స్పందిస్తారో..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments