139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యువతి

  • IndiaGlitz, [Monday,August 31 2020]

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ సంచలనం సృష్టించిన యువతి నేడు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. సదరు యువతి పంజాగుట్టలో కూడా తనపై 139 మంది అత్యాచారం జరిపారని కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే మరో సంచలనానికి తెరదీసింది. ఈ కేసులో ఆది నుంచి కీలక పాత్ర పోషిస్తున్న డాలర్ భాయ్.. చెప్పినట్టే చేశానని తనపై ఎవరూ అఘాయిత్యానికి పాల్పడలేదని ట్విస్ట్ ఇచ్చింది. డాలర్‌ భాయ్‌ తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది.
 
‘‘నాతో ప్రమేయం లేనివారిపై కూడా డాలర్ భాయ్ కేసులు పెట్టించాడు. మొత్తం డాలర్‌ భాయ్‌ చెప్పినట్లే చేశాను. ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పాలో రాత్రిపూట నాకు డిక్టేట్‌ చేసేవాడు. నా వల్ల అమాయకులకు శిక్ష పడకూడదని భావించాను. ఫొటోలు, వీడియోలు తీసి నన్ను డాలర్ భాయ్ బెదిరించాడు. 139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు. నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడు. మొత్తం డాలర్‌ భాయ్‌ చెప్పినట్లే చేశాను. డాలర్‌ భాయ్‌తో నాపట్ల అమానుషంగా వ్యవహరించాడు.

నాకు జరిగిన అన్యాయం, మరెవరికీ జరగకూడదు. చెప్పినట్లు చేయకపోతే నా కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడు. డాలర్ భాయ్ ఒత్తిడి వల్లే యాంకర్ ప్రదీప్ పేరు చేర్చాల్సి వచ్చింది. అంతేకాదు నటుడు కృష్ణుడికి కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నన్ను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్‌లో మాట్లాడించాడు. నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు. సంబంధం లేదని చెప్పినా సెలబ్రిటీల పేర్లు చేర్చాడు’’ అని బాధిత యువతి చెప్పింది.