ఏపీలో కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన 'సీరో' సర్వే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా టెస్టులు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.. ఇప్పటికే ఐదు లక్షలకు పై చిలుకు కేసులు ఏపీలో నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చూపుతున్న బోగస్ లెక్కలు కూడా ఏపీలో చూపించట్లేదు. చాలా జెన్యూన్‌గా రాష్ట్రంలో వచ్చిన లెక్కలను ప్రతిరోజూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘సీరో’అనే సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఏపీలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయిందని ఈ సర్వే వెల్లడించింది. వ్యక్తి రక్తంలోని యాంటీ బాడీస్ ఆధారంగా కరోనా సోకిందా.. లేదా? అనేది గుర్తించవచ్చు.
వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మీడియాకు వివరించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి.. అంటే దాదాపు కోటి మందికి కరోనా సోకి వెళ్లిపోయినట్టుగా నిర్ధారణ అయింది. తొలిదశ సర్వేను కృష్ణా, అనంతపురం, నెల్లూరు తూర్పు గోదావరి జిల్లాల్లో నిర్వహించగా... 15.7 శాతం మందికి వైరస్ సోకి, వెళ్లిపోయినట్లు తేలింది. మలిదశ సర్వేను మిగిలిన 9 జిల్లాల్లో నిర్వహించారు. మొత్తమ్మీద 19.7 శాతం మందికి కరోనా సోకి వెళ్లిపోయినట్టు నిర్థారణ అయింది.
సర్వే కోసం ఒక్కో జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున తీసుకుని మొత్తం 45వేల శాంపిల్స్‌ను సీరో ప్రతినిధులు సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి తెలియకుండానే వైరస్ సోకి.. దానంతట అదే తగ్గిపోయినట్టు తేలింది. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వారిలో కనీసం ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. చాలా కాలం వరకూ గ్రీన్ జోన్‌లో ఉన్న విజయనగరం జిల్లాలో అత్యధికంగా యాంటీబాడీస్‌ను గుర్తించడం విశేషం. ఈ జిల్లాలో 30.6 శాతం మంది రక్త నమూనాల్లో యాంటీబాడీస్‌ను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా 12.3 శాతంతో ఆఖరి స్థానంలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments