తెలంగాణ విద్యార్థికి కరోనా కష్టం.. చెట్టుపైనే ఐసొలేషన్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని అత్యంత దయనీయ స్థితిలోకి తీసుకెళుతోంది. కరోనా సోకిన వారు 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో జీవితాలు సింగిల్ రూమ్‌లోనే గడిచిపోతున్నాయి. మరి అలాంటి వారు ఎక్కడ ఉండాలి? ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. మరి ఇంట్లోని వారికి సోకకూడదంటే పాజిటివ్ వచ్చినవారు ఎక్కడ ఉండాలి? ఇలాంటి స్థితిలో ఉన్న ఒక కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ ఐసోలేషన్‌ను ఎక్కడ పూర్తి చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. తమ వారికి కరోనా సోకకూడదన్న తపనతో ఒకరు చెట్టును ఆవాసంగా చేసుకుంటే మరొకరు చిన్న ఇరుకైన బాత్రూంను ఆవాసంగా మార్చుకున్నారు.
Also Read: బిగ్ బజ్ : బాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ?
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన రమావత్ శివనాయక్... హైదరాబాద్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తరగతులు లేకపోవడంతో కొన్ని నెలలుగా గ్రామంలోనే ఉండి సాగు పనులు చూసుకుంటున్నాడు. ఇటీవల ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు ఉండటంతో 10రోజుల క్రితం అడవిదేవులపల్లి పీహెచ్‌సీలో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శివ కుటుంబసభ్యులు మొత్తం ఐదుగురు. అంతా ఒకే గదిలో ఉంటున్నారు. దీంతో అతడు ఇంటి ముందున్న చెట్టు కొమ్మల్లో మంచం కట్టి అక్కడే తన 14 రోజుల ఐసోలేషన్‌ను పూర్తి చేస్తున్నాడు.
ఇక వికారాబాద్ జిల్లా మైలాపూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిదీ ఇదే కథ. మైలారం గ్రామానికి చెందిన సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంట్లో క్వారంటైన్‌కు వసతి లేకపోవడంతో చిన్న ఇరుకైన బాత్రూంలోనే ఉంటున్నాడు. తానుంటున్న పరిస్థితిని వీడియో తీసి గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. అతడిని అంబులెన్సులో అనంతగిరి కొవిడ్ ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments