తండ్రి వయసున్న వ్యక్తితో ఎఫైర్, చైల్డ్ కూడా ? హీరోయిన్ పై షాకింగ్ రూమర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్ర పరిశ్రమలో నటీనటుల వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. హీరోయిన్లు, హీరోలు తమ పర్సనల్ లైఫ్ గురించి ఏమీ చెప్పకపోయినా ఊహాగానాలు మాత్రం ఆగవు. తాజాగా చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ కూడా ఇలాంటి రూమర్స్ వల్ల ఎఫెక్ట్ అయింది.
తన గురించి వైరల్ అవుతున్న సంచలన రూమర్ ని అవికా ఖండించింది. అవికా తన కోస్టార్ మనీష్ రైసింఘన్ తో ఎఫైర్ సాగిస్తోంది అంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్ తనని చాలా భాదపెట్టాయని తాజాగా అవికా ఇంటర్వ్యూలో తెలిపింది.
అవికా, మనీష్ మధ్య కొంతకాలం ఎఫైర్ సాగింది అని, వారిద్దరికీ బిడ్డ కూడా జన్మించింది అని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆ బిడ్డని సీక్రెట్ గా పెంచుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన అవికా అవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని కొట్టిపారేసింది.
నా జీవితంలో మనీష్ ముఖ్యమైన వ్యక్తి. నాకు 13 ఏళ్ల నుంచే మనీష్ తో పరిచయం. నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ లో మనీష్ ఒకరు. ఆయనతో డేటింగ్, పిల్లలు అంటూ వస్తున్న రూమర్స్ హాస్యాస్పదమైనవి అని అవికా తెలిపింది. అసలు అది ఎలా సాధ్యం అవుతుంది. నాకన్నా మనీష్ 18 ఏళ్ళు వయసులో పెద్ద. దాదాపు ఆయనకు మా తండ్రి వయసు ఉంది. అలాంటప్పుడు ఈ రూమర్స్ ఎలా వచ్చాయో తెలియదు.
మనీష్ నాకన్నా చాలా పెద్దవారు. ఆయన నుంచి లైఫ్ లో చాలానే నేర్చుకున్నా అని అవికా గోర్ తెలిపింది. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి విజయవంతమైన చిత్రాల్లో అవికా నటించింది. ప్రస్తుతం అవికా తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తాను తన స్నేహితుడు మిలింద్ అనే వక్తితో ప్రేమలో ఉన్నట్లు అవికా ఇటీవలే రివీల్ చేసింది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని కూడా తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments