ఇంటి అద్దె.. నెలకు రూ.2 కోట్లు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంటి అద్దె రూ.10 వేలు అంటేనే.. ముచ్చెమటలు పోసి.. మూడు చెరువుల నీళ్లు తాగినంత పనవుతుంది కొందరికి. కానీ వారానికి అర కోటి అంటే నెలకు అక్షరాలా రూ.2 కోట్లు అద్దె అంటే ఎలా ఉంటుంది? వింటుంటేనే సంభ్రమాశ్చర్యాలతో కళ్లు రెండింతలైపోయి.. నోరు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. కానీ ఇది నిజం.. అయితే ఇక్కడ కూడా లండన్లో.. అయితే మనకెందుకు అనుకుంటున్నారా? తీసుకుంది మన దేశానికి చెందిన వ్యక్తి కాబట్టి. ఆయన మరెవరో కాదు ప్రముఖ వ్యాపార దిగ్గజం.. కొవిషీల్డ్ (ఆక్స్ఫర్డ్) టీకా తయారీసంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా.
కోటి రూపాయలుంటే చాలు.. జీవితాంతం దర్జాగా బతికేయవచ్చన్న భావనలో ఉంటాం. అలాంటిది మన దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా లండన్లోని అత్యంత ఖరీదైన ప్రాంతం మేఫెయిర్లో ఓ విలాసవంతమైన భవంతిని ఇటీవల లీజుకు తీసుకున్నారు. ప్రతివారం 50 వేల పౌండ్ల (రూ.అర కోటి)ని అద్దెగా చెల్లిస్తానని ఆ ఇంటి యజమాని, ప్రముఖ బిలియనీర్ డొమినికా కల్క్జిక్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ భవనం అత్యంత విశాలంగా 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని తెలుస్తోంది. దీని ప్రాంగణంలోనే ఒక అతిథి గృహంతో పాటు కనువిందు చేసే ఉద్యానవనాలు సైతం ఉన్నాయి. మరి ఇన్ని సౌకర్యాలున్నాయంటే ఆ మాత్రం ఉండటం సహజమే కదా..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments