ఈనాడు సిబ్బందికి కరోనా టెస్ట్.. షాకింగ్ రిజల్ట్

  • IndiaGlitz, [Sunday,June 21 2020]

కరోనా మహమ్మారి నేడు అన్ని సంస్థలకూ పాకింది. ముఖ్యంగా కరోనాను అరికట్టడంలో ఫ్రంట్ లైన్‌లో ఉన్న వారిలో హెల్త్, పోలీస్, జీహెచ్ఎంసీతో పాటు మీడియా కూడా ఉంది. ప్రస్తుతం ఈ డిపార్ట్‌మెంట్‌లన్నింటిలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కాగా.. నేడు ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు తన సిబ్బందికి కరోనా పరీక్ష చేయించింది. ఈ పరీక్షలో షాకింగ్ రిజల్ట్ వెలుగు చూసింది.
ఏకంగా సంస్థలోని 16 మందికి క‌రోనా సోకిన‌ట్టు సమాచారం. ఇది మీడియా వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

రామోజీ ఫిలింసిటీలోని ఈనాడుతో పాటు ఇతర సిబ్బంది ర్యాండమ్‌గా మొత్తం 125 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అందులో 16 మందికి పాజిటీవ్ అని తేలింది. దీంతో.. యాజ‌మాన్యం షాక్‌కి గురైంది. పాజిటివ్ వచ్చిన వాళ్ల కుటుంబ సభ్యులకు సైతం ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సిబ్బంది మొత్తం ఆఫీసుకి రావడానికే భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈనాడు యాజమాన్యం కూడా ఉద్యోగులకు ఎలా రక్షణ కల్పించాలి.. ఉన్నవారితో ఎలా మేనేజ్ చేసుకోవాలనే దానిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

More News

కరోనాతో విజయ ఆస్పత్రి డైరెక్టర్ మృతి

చెన్నైలోని ప్రసిద్ధి గాంచిన విజయ ఆస్పత్రి డైరెక్టర్ శరత్ రెడ్డి(43) కరోనాతో చనిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం విజయ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నిజ ఘ‌ట‌న ఆధారంగా సినిమా అనౌన్స్ చేసిన వ‌ర్మ‌

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా సినిమాలు చేయ‌డంలో రామ్ గోపాల్ వ‌ర్మ దిట్ట‌. 26/11 వంటి సినిమా ఆయ‌న తెర‌కెక్కించిన ఈ త‌ర‌హా చిత్రాల‌కు ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

ఈ సూర్యగ్రహణం కరోనాకు చెక్ పెట్టనుందా?

యోగా డేను కూడా మరిపించేలా దేశవ్యాప్తంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం కొనసాగుతోంది. దాదాపు 4 గంటల పాటు ఉండే ఈ ఖగోళ అద్భుతం ఓ శుభవార్తను అందించింది.

తెలంగాణలో నిన్న ఒక్కరోజే 546 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.

కరోనా మహమ్మరికి ఔషధం సిద్ధం.. త్వరలోనే మార్కెట్‌లోకి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఔషధం సిద్ధమైంది.