ఈనాడు సిబ్బందికి కరోనా టెస్ట్.. షాకింగ్ రిజల్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి నేడు అన్ని సంస్థలకూ పాకింది. ముఖ్యంగా కరోనాను అరికట్టడంలో ఫ్రంట్ లైన్లో ఉన్న వారిలో హెల్త్, పోలీస్, జీహెచ్ఎంసీతో పాటు మీడియా కూడా ఉంది. ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్లన్నింటిలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కాగా.. నేడు ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు తన సిబ్బందికి కరోనా పరీక్ష చేయించింది. ఈ పరీక్షలో షాకింగ్ రిజల్ట్ వెలుగు చూసింది.
ఏకంగా సంస్థలోని 16 మందికి కరోనా సోకినట్టు సమాచారం. ఇది మీడియా వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
రామోజీ ఫిలింసిటీలోని ఈనాడుతో పాటు ఇతర సిబ్బంది ర్యాండమ్‌గా మొత్తం 125 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అందులో 16 మందికి పాజిటీవ్ అని తేలింది. దీంతో.. యాజమాన్యం షాక్‌కి గురైంది. పాజిటివ్ వచ్చిన వాళ్ల కుటుంబ సభ్యులకు సైతం ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సిబ్బంది మొత్తం ఆఫీసుకి రావడానికే భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈనాడు యాజమాన్యం కూడా ఉద్యోగులకు ఎలా రక్షణ కల్పించాలి.. ఉన్నవారితో ఎలా మేనేజ్ చేసుకోవాలనే దానిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com