కడప జిల్లాలో వైసీపీకి షాక్.. టికెట్ ఇవ్వలేదని రాజీనామా!

  • IndiaGlitz, [Sunday,January 27 2019]

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల జంపింగ్‌లు షురూ అయ్యాయి. ఎప్పట్నుంచో పార్టీ కోసం పనిచేస్తూ టికెట్లు ఆశించిన నేతలకు అధినేతలు షాకివ్వడంతో సడన్‌గా రాజీనామా చేసేసి గోడదూకేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఇలా జంపింగ్ చేసిన సంఘటనలు కోకొల్లలు. ఓ వైపు పార్టీ అధిపతులు అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో తమకు ఎక్కడైతే సముచిత స్థానం టికెట్ హామీ ఉంటుందో ఆ గూటికెళ్తున్నారు. కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ పరిస్థితి ఎలా ఉంది..? వైఎస్ జగన్ జమ్మలమడుగు అభ్యర్థిని ప్రకటించిన అనంతరం పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇప్పుడు చూద్దాం.

మొన్న టీడీపీలో.. నేడు వైసీపీలో పంచాయితీ..!
ఇతర జిల్లాలతో పోలిస్తే కడప జిల్లాలో టికెట్ల పంచాయితీ చాలా భిన్నంగా ఉంటుంది. ఒక్కో నియోజకవర్గం టికెట్ కోసం దాదాపు ఏడుగరు అభ్యర్థులు కొట్లాడుకున్న సందర్భాలున్నాయి. మరీ ముఖ్యంగా జిల్లాలో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి జంప్ అవ్వడంతో ఆ స్థానాల్లో అధిష్టానం ఇన్‌చార్జీలను నియమించడం జరిగింది. కచ్చితంగా తమకే టికెట్ వస్తుందని భావించి నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తున్నారు కొందరు నేతలు. కాగా.. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయన జంప్ అవ్వడంతో కచ్చితంగా టికెట్ తనదేనని డా. సుధీర్ రెడ్డి.. మరోవైపు అల్లే ప్రభావతమ్మ జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం పోటాపోటీగా పనిచేస్తూ వచ్చారు. టీడీపీ నుంచి ద్వితియ శ్రేణినాయకులను మొదలుకుని కార్యకర్తల వరకూ వైసీపీలో చేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు.

మరోవైపు టీడీపీలో సైతం మంత్రిగా పనిచేసిన తనకే టికెట్ వస్తుందని ఆదినారాయణరెడ్డి.. కాదు.. కాదు టికెట్ తనకే అని రామసుబ్బారెడ్డి పోటాపోటీగా బలప్రదర్శన చేసుకున్నారు. ఇదర్నీ అమరావతికి పిలిపించుకున్న సీఎం చంద్రబాబు పంచాయితీ పెట్టి ఒకర్ని ఎంపీగా.. మరొకర్ని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతానని చెప్పారు. అయితే ఎవరు ఎమ్మెల్యేగా.. ఎవరు ఎంపీగా అనేది మీ చాయిస్ ‌మీరే తేల్చుకోండని చెప్పారు. దీంతో ప్రస్తుతానికి ‘జమ్మలమడుగు టీడీపీ పంచాయితీ’కి ఫుల్‌స్టాప్ పడింది కానీ.. కన్ఫామ్ చేయాల్సి ఉంది. అయితే తాజాగా ఇదే పరిస్థితి వైసీపీలోనూ నెలకొంది.

పాదయాత్ర నుంచి రాగానే ‘అల్లే’కు షాక్!
‘ప్రజా సంకల్ప యాత్ర’ పూర్తి చేసుకుని కడప జిల్లాకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. జిల్లాలో మొదట జమ్మలమడుగు అభ్యర్థిగా సుధీర్‌రెడ్డిని ప్రకటించారు. దీంతో షాక్‌‌కు గురైన మాజీ జడ్పీటీసీ అల్లే ప్రభావతమ్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే కచ్చితంగా మీకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆమె మాత్రం కచ్చితంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టగా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే నాటినుంచి అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆఖరికి శనివారం రాత్రి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖను అధిష్టానానికి పంపారు.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి..!
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి తన సత్తా ఏంటో చూపిస్తానన్నట్లుగా అల్లే చెప్పుకొచ్చారు. కాగా నియోజకవర్గంలో సగం సుధీర్ రెడ్డి.. ఇంకో సగం అల్లే ప్రభావతి చేతిలో ఉంటుందని.. వైసీపీకి గట్టి పట్టుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అల్లే రాజీనామా చేయడం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బేనని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే.. మొదటి అభ్యర్థికే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఇంకెలా ఉంటాయో..! జగన్ సొంత జిల్లాలోనే ఇలా జరగడంతో టీడీపీ నేతలు సువర్ణావకాశంగా భావించి ‘అల్లే’ను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారట. ఇదే జరిగితే ఈ నియోజకవర్గంలో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులు మెండుగా ఉంటాయని తెలుస్తోంది. అయితే అల్లేను వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తుందా..? లేకుంటే అలాగే వదిలేస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

వరుణ్‌తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ భారీ చిత్రం 'వాల్మీకి' ప్రారంభం

ఫిదా', 'తొలిప్రేమ', 'అంతరిక్షం', 'ఎఫ్‌2' వంటి విభిన్న చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్న మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా

కంగ‌నా వివాదంపై .. క్రిష్ చెప్పిన నిజాలు

జాగ‌ర్ల‌మూడి క్రిష్, బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కాంబినేష‌న్‌లో `మ‌ణిక‌ర్ణిక‌:  ది ప్రిన్సెస్ ఆఫ్ ఝాన్సీ` సినిమాను అనౌన్స్ చేశారు.

1000 డ్యాన్స‌ర్స్‌తో మెగా సాంగ్‌!

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర

నాని చిత్రంలో వింకీ బ్యూటీ..!!

వ‌రుస విజ‌యాల హీరోగా పేరున్న నానికి `కృష్ణార్జున‌యుద్ధం` బ్రేక్ వేసింది. ఇప్పుడు నాని `మ‌ళ్ళీరావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో

ఆ ఇద్ద‌రితో మ‌రోసారి చిరు?

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి న‌టించ‌డం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు. తాజాగా ఆయ‌న మ‌రోసారి ఇద్ద‌రు హీరోయిన్స్‌తో